సజ్జల బాధ్యతలపై జగన్ కీలక నిర్ణయం, ఇక నుంచి - మార్పులు మొదలు..!!

మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాల తీసుకుంటున్నారు. తిరిగి పార్టీని బలోపేతం దిశగా మార్పులకు సమాయత్తం అవుతున్నారు. పార్టీలో కీలక వ్యక్తుల బాధ్యతల్లో మార్పులు చేస్తున్నారు. నియోజక వర్గాల వారీగా ఇంఛార్జ్ లు.. పార్టీ జిల్లా నుంచి గ్రామ కమిటీల ఏర్పాటు కూర్పు కొనసాగుతోంది. ఇక సంక్రాంతి నుంచి తాడేపల్లి కేంద్రంగా జగన్ పూర్తి సమయం పార్టీకే కేటాయించనున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల బాధ్యతల విషయంలో తాజా నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. మరి కొన్ని మార్పులకు జగన్ కసరత్తు చేస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల తో పాటుగా సీఎంఓలో పని చేసిన అధికారుల పైన పలువురు నేతలు విమర్శలు చేసారు. వారి తీరును తప్పు బట్టారు. తాజాగా మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వారు సైతం జగన్ భజన చేసే వారి కంటే పార్టీకి మేలు చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ సూచన చేసారు.

ys-jagan-key-decision-over-sajjala-responsibilities-in-the-party-amid-latest-changes

సజ్జల రామక్రిష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. సాక్షి వ్యవహారాల నుంచి పార్టీ లో బాధ్యతల వరకు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడూ అదే విధంగా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే, జగన్ తాజాగా పార్టీలో కీలక మార్పుల కు సమాయత్తం అవుతున్నారు. అందులో భాగంగా ఆసక్తి కర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, ఆ పార్టీ సోషల్ మీడియా మాజీ ఇంఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి జగన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో భార్గవరెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. ఏడాది ఆగస్టులో పార్టీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి భార్గవ రెడ్డిని తప్పించారు. ఇప్పుడు భార్గవ రెడ్డికి సాక్షి మీడియాలో డిజిటల్ హెడ్ గా నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

భార్గవ్ పైన వచ్చిన ఆరోపణలు.. పార్టీలోని కొందరు నేతలు చేసిన ఫిర్యాదుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల నుంచి తప్పించి సాక్షి బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. అయితే, కొందరు ఇది ప్రమోషన్ గా చెబుతుంటే.. పార్టీలో నేతలు మాత్రం ప్రక్షాళన లో భాగంగా తీసుకున్న నిర్ణయంగా విశ్లేషణలు చేస్తున్నారు. అదే విధంగా పార్టీలో జగన్ కోర్ టీంగా ఉన్న వారి బాధ్యతల్లోనూ త్వరలో మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. దీంతో, జగన్ నిర్ణయాల పైన పార్టీలో ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+