వైసీపీలో కొత్త ఇంఛార్జ్ లు - విడదల రజనీకి మళ్లీ నియోజకవర్గం మార్పు..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. పార్టీలోని ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు మొదలు పెట్టారు. టీడీపీ కంచుకోటల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన జగన్ అవసరమైన కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా మరో సారి మాజీ మంత్రి విడదల రజనీ నియోజకవర్గం మార్పు తప్పదనే చరచ మొదలైంది.
మాజీ సీఎం జగన్ పార్టీలో కీలక నియామకాల పైన కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు నిర్వహిస్తున్న బాధ్యతల్లో మార్పులు చేస్తున్నారు. అనుబంధ విభాగాల బలోపేతం పైన చర్యలు మొదలు పెట్టారు. తాజాగా కర్నూలు పార్లమెంట్ కు మాజీ ఎంపీ బుట్టా రేణుక.. ఎమ్మిగనూరు బాధ్యతలు రాజీవ్ రెడ్డికి అప్పగించిన జగన్ మిగిలిన నియామకాల పైన క్షేత్ర స్థాయి నివేదికల ను తెప్పించు కుంటున్నారు. 2024 ఎన్నికల ముందు సామాజిక సమీకరణాల పేరుతో భారీ స్థాయిలో నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పు చేసారు. పలువురిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసారు. ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. దీంతో.. ఎన్నికల తరువాత కొందరిని తిరితి వారి పాత నియోజకవర్గాలకు మార్పు చేసారు. అయితే.. ఇప్పుడు విడదల రజనీ విషయంలో మాత్రం మరో సారి నియోజకవర్గ మార్పు తప్పదనే చర్చ పార్టీలో జరుగుతోంది.

మాజీ మంత్రి విడదల రజనీ టీడీపీ నుంచి 2018 లో వైసీపీలో చేరి 2019 లో చిలకలూరి పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రెండేళ్లకే మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల సమయం లో టీడీపీ కంచుకోట అయిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జగన్ బరిలోకి దింపారు. ఆ ఎన్నికల్లో రజనీ ఓడిపోయారు. దీంతో... రజనీ అభ్యర్ధన మేరకు తిరిగి సొంత నియోజకవర్గం చిలక లూరిపేట బాధ్యతలు కేటాయించారు. అయితే.. ఇప్పుడు రజనీకి మరో కీలక నియోజకవర్గ బాధ్యత లు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీల ఎక్కువగా ఉన్న రేపల్లె నియోజకవర్గానికి రజనీని ఇంఛార్జ్ గా నియమించనున్నట్లు సమాచారం. అక్కడ మోపిదేవి కాంగ్రెస్, వైసీపీ కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేసారు. 2024 లో ఈపూరు గణేశ్ వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు.
అప్పటి వరకు కీలక నేతగా వ్యవహరించిన మోపిదేవి పార్టీ వీడారు. గణేశ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాగా, ప్రస్తుతం అక్కడ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. టీడీపీ కి రేపల్లె కంచుకోటగా మారింది. దీంతో.. వచ్చే ఎన్నికల కోసం బలమైన బీసీ నేతకు నియోజక వర్గం అప్పగించాలని జగన్ యోచిస్తున్నారు. అందులో భాగంగా విడదల రజనీ పేరు పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. రజనీ మాత్రం చిలకలూరి పేట నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. మరి.. జగన్ ఇప్పుడు రజనీ నియోజకవర్గం మరో సారి మార్పు చేస్తారా.. రజనీ కోరుతున్న విధంగా చిలకలూరి పేటలోనే కొనసాగిస్తారా అనేది ఆసక్తిగా మారుతోంది.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!!












Click it and Unblock the Notifications