అవినీతి మహారాజు, లంచాలతో ఎమ్మెల్యేలను కొంటున్నాడు: బాబుపై జగన్(పిక్చర్స్)
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు అవినీతి మహారాజు అని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓదార్పుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేర్వేరు సభల్లో మాట్లాడారు.
లంచాలు తీసుకుని సంపాదించిన నల్లధనంతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, దీని నుంచి తప్పించుకోవడానికే సెక్షన్-8 అంటూ వివాదాలు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు. ఇదొక్కటే కాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో తమ పార్టీకి బలం లేనందునే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇచ్చామని తెలిపారు. టిడిపి మాత్రం కాసులు కుమ్మరించి ఎమ్మెల్సీ పదవులు పొందాలని చూస్తుస్తోందని ఆరోపించారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఈ ప్రమాదంలో 22 మరణించినా, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని చెప్పారు. నాలుగురోజుల్లో రూ.2 లక్షల వంతున చెల్లించకపోతే ఆందోళన చేస్తామని తెలిపారు. మృత్యుంజయుడు కిరణ్‌కు అన్ని విధాల ఆదుకుంటానన్నారు.

వైయస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైయస్ జగన్
చంద్రబాబు అవినీతి మహారాజు అని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఓదార్పుయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వేర్వేరు సభల్లో మాట్లాడారు.

వైయస్ జగన్
లంచాలు తీసుకుని సంపాదించిన నల్లధనంతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, దీని నుంచి తప్పించుకోవడానికే సెక్షన్-8 అంటూ వివాదాలు సృష్టిస్తున్నారని జగన్ విమర్శించారు.

వైయస్ జగన్
ఇదొక్కటే కాకుండా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వైయస్ జగన్
తెలంగాణలో తమ పార్టీకి బలం లేనందునే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇచ్చామని తెలిపారు.

వైయస్ జగన్
టిడిపి మాత్రం కాసులు కుమ్మరించి ఎమ్మెల్సీ పదవులు పొందాలని చూస్తుస్తోందని ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమళ్లాపురం, హుకుంపేట గ్రామాల నుంచి వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పెరుమళ్లాపురంలో మాట్లాడుతూ.. చేపలవేట విరామ సమయంలో 50 కేజీల
బియ్యం, రూ.3 వేలు చొప్పున ఇస్తామని చెప్పి, ఆ సంగతే మర్చిపోయారన్నారు.
తుపాను వస్తుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కనీసం హెచ్చరికలు కూడా చేయని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇంత పెద్ద ప్రమాదాలు జరిగినా ప్రరామర్శకు ముఖ్యమంత్రి స్వయంగా రాకపోవడం విచారకరమని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్‌ఈజెడ్ భూములను వెనక్కి ఇస్తామని చెప్పిన బాబు తర్వాత ఆ విషయం మర్చిపోయారని ఆరోపించారు.
భూముల విషయం ప్రశ్నిస్తే అవన్నీ జగన్‌వే అంటున్నారని, అలా అయితే ఆ భూములు తనకు తిరిగిచ్చేయాలని అన్నారు. ఎస్‌ఈజెడ్ భూముల విషయంలో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తాము అండగా ఉంటామని, న్యాయం జరిగేవరకూ పోరాడతామని అన్నారు.












Click it and Unblock the Notifications