అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతా మోసం, సినీ విలన్లే నయం! బీసీలకు అండగా ఉంటా: బాబుపై జగన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !

అనంతపురం: రిజర్వేషన్ల పేరుతో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రతీ కులాన్ని మోసం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

<strong>అదే నాకు కిక్కిస్తోంది: 'బజార్లో దొరికిన బూట్లే' అంటూ నవ్వేసిన జగన్</strong>అదే నాకు కిక్కిస్తోంది: 'బజార్లో దొరికిన బూట్లే' అంటూ నవ్వేసిన జగన్

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె సమీపంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అన్యాయం, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు వైయస్‌ జగన్‌ చెప్పారు.

అంతా మోసమే..

అంతా మోసమే..

చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని వైయస్ జగన్‌ ప్రజలను ప్రశ్నించారు. కులాలను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని.. కానీ, ప్రతీ కులాన్ని ఎలా మోసం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు మ్యానిఫెస్టో పెట్టారని, అందుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులే నిదర్శనమని జగన్‌ చెప్పారు. కురుమలను ఎస్టీల్లో చేరుస్తానని , బోయలను ఎస్టీల్లో చేరుస్తానని మూడుసార్లు తీర్మానం చేశారని, రజకులను ఎస్సీలుగా మారుస్తానని చం‍ద్రబాబు చెప్పారని.. కానీ, ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైయస్‌ జగన్ తెలిపారు.

బాబు కంటే సినిమాలో విలన్లే నయం

బాబు కంటే సినిమాలో విలన్లే నయం

‘ఎన్నికల హామీని చంద్రబాబు అమలు చెయ్యరు. అధికారంలోకి వచ్చాక కూడా ఇది కేంద్రం పని అని తప్పించుకుంటున్నారు. సినిమాల్లోని విలన్ల కన్నా దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఇంతవరకు ఏ టీడీపీ నేత కూడా పరామర్శించలేదు. లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించారు. కానీ, అది నెరవేర్చలేదు. బాబు సీఎం అయ్యాక రుణమాఫీ ఎలా ఉన్నా.. ప్రతీ నెలా వచ్చే సబ్సిడీ కూడా చేనేత కార్మికులకు అందటం లేదు' జగన్ ఆరోపించారు. నాలుగు కత్తెర్లు, నాలుగు ఐరెన్ బాక్సులిచ్చి బీసీలపై ప్రేమ ఉందంటే ఎలా? అని జగన్ ప్రశ్నించారు.

ఆ పని చేసిన ఏకైక వ్యక్తి వైయస్సే

ఆ పని చేసిన ఏకైక వ్యక్తి వైయస్సే

‘బీసీల అభివృద్ధి అంటే వారిని పేదరికంలోని ఎలా బయటకు తీసుకురావాలి.. వారి అభివృద్ధికి ఏమేం చేయాలో ఆలోచించాలి. ఆ పని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఒక్క దివంగత నేత వైయస్సార్‌ మాత్రమే. ఆయన హయాంలో చదువుల విప్లవం వచ్చింది. ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వాళ్లు ఇప్పుడు ఆ మహానేతను గుర్తు చేసుకుంటున్నారు

కానీ, వైయస్సార్‌ మరణం తర్వాత పరిస్థితి తిరగబడింది. బాబు పాలనలో ఉచిత విద్య లేదు. పేదలకు ఆరోగ్య సేవలు దూరం అయ్యాయి. 108, ఆరోగ్యశ్రీలు నిర్వీర్యం అయ్యాయి' అని జగన్ అన్నారు.

బాబులా మోసం చేయను

బాబులా మోసం చేయను

‘చంద్రబాబు కంటే నేను చిన్నవాడినే కావొచ్చు కానీ, ఆయనలా మోసం చెయ్యను. కులాల అభివృద్ధి కోసం కచ్ఛితంగా కృష్టి చేస్తాను. ప్రజలకు మేలు చేసేందుకే నవరత్నాలు తీసుకొచ్చాను. పేదరికం దూరం చేసేందుకు నాన్న ఒక్క అడుగు ముందుకు వేస్తే.. నేను రెండు అడుగులు ముందుకేస్తా. నవరత్నాల పథకం ద్వారా ప్రతీ చిన్నారి చదువుకుంటారు. ప్రతీ తల్లి ఖాతాలో ఏటా 15 వేలు ఇస్తాం. చదువుల కోసం అప్పుల చేసే అవసరం లేకుండా ప్రతీ బీసీ కుటుంబానికి అండగా ఉంటా. పని చేసే శక్తి కోల్పోయిన వాడు ఆకలితో అలమటించకూడదు' అని జగన్ చెప్పారు.

ఆ తప్పు పునరావృతం కాదు..

ఆ తప్పు పునరావృతం కాదు..

అంతేగాక, ‘బాబు పాలనపై మనకు మనమే ప్రశ్నించుకోవాలని తరుణం వచ్చింది. అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాబోదు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో కనీసం ఒక ఎంపీ స్థానం బీసీలకే కేటాయిస్తాం. విభజన తర్వాత అన్యాయం జరిగిన కులాలకు అండగా ఉంటాం' అని జగన్‌ వివరించారు.

English summary
YSRCP President YS Jaganmohan Reddy on Saturday lashed out at Andhra pradesh CM Chandrababu for reservation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X