ప్రజలు తిట్టకముందే.. ఆయనే తిడుతున్నారు: చంద్రబాబుపై వైయస్ జగన్
కడప: సుమారు నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సాయం అందడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు. గుంజనా నది వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తక్షణమే ఇంటికి 25 కిలోల చొప్పున బియ్యం, నగదు అందించాలని జగన్ డిమాండ్ చేశారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదని.. నిధులిచ్చి అధికారులను పనిచేయమని చెబితే వారు చేస్తారని ఆయన చెప్పారు. అలా కాకుండా, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని తిట్టకముందే ఆయనే అధికారులను తిడుతున్నారని మండిపడ్డారు.
ఎంతమందికి మేలు జరిగిందో ప్రజలనే అడిగి తెలుసుకోవాలని అన్నారు. పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 3, 4 వేల రూపాయల డబ్బులు, 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర ఇస్తేనే వరద బాధిత ప్రజలు బతకగలరని చెప్పారు.
అవేవీ ఇవ్వకుండా అధికారులను తిట్టడం మానవత్వం ఉన్న పని కాదని చెప్పారు. ప్రభుత్వం నుంచి తమకేలాంటి సాయం అందట్లేదని ప్రజలు వాపోతున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ప్రజలకు సాయం అందించాలని అన్నారు.

వైయస్ జగన్
సుమారు నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సాయం అందడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

వైయస్ జగన్
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఆయన పర్యటించారు.

వైయస్ జగన్
గుంజనా నది వరదలతో ప్రభావితమైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. తక్షణమే ఇంటికి 25 కిలోల చొప్పున బియ్యం, నగదు అందించాలని జగన్ డిమాండ్ చేశారు.

వైయస్ జగన్
వర్ష ప్రభావిత ప్రాంతాల పరిశీలన అంటే అధికారులను తిట్టడం కాదని.. నిధులిచ్చి అధికారులను పనిచేయమని చెబితే వారు చేస్తారని ఆయన చెప్పారు.

వైయస్ జగన్
అలా కాకుండా, ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని తిట్టకముందే ఆయనే అధికారులను తిడుతున్నారని మండిపడ్డారు.

వైయస్ జగన్
ఎంతమందికి మేలు జరిగిందో ప్రజలనే అడిగి తెలుసుకోవాలని అన్నారు. పనులకు పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 3, 4 వేల రూపాయల డబ్బులు, 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, చక్కెర ఇస్తేనే వరద బాధిత ప్రజలు బతకగలరని చెప్పారు.

వైయస్ జగన్
ప్రభుత్వం నుంచి తమకేలాంటి సాయం అందట్లేదని ప్రజలు వాపోతున్నారని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ప్రజలకు సాయం అందించాలని అన్నారు.












Click it and Unblock the Notifications