ప్రత్యేక హోదాను మళ్లీ తెర మీదికి తెస్తున్న జగన్: వైసిపిలోకి ముత్తా, కన్నబాబు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెర మీదికి తెస్తున్నారు. గత కొద్ది కాలంగా ప్రత్యేక హోదా చిచ్చు సద్దుమణిగినట్లు కనిపించింది.
ప్రత్యేక హోదా సాధన కోసం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తలపెట్టిన యువభేరీ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఈ యువభేరీ కార్యక్రమంలో పాల్గొనడానికి వైయస్ జగన్ హైదరాబాదు నుంచి రాజమండ్రి బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన కాకినాడ చేరుకుంటారు.

వైయస్ జగన్ కాకినాడ పర్యనట సందర్భంగా మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, యువ నాయకుడు ముత్తా శశిధర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారు. వైయస్ జనగన్ బుధవారం సాయంత్రం 3 గంటలకు జెఎన్‌టియూ సమీపంలోని బిల్డింగ్ సొసైటీలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఉదయం పదిన్నర గంటలకు కాకినాడలోని అంబేడ్కర్ భవన్ చేరుకుని అక్కడ యువభఝేరీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను, యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications