శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనుషులేనా: కెసిఆర్‌పై జగన్ విసుర్లు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీరును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తప్పు పట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకే కెసిఆర్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

శ్రీకాకుళంలో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో కుంభకోణం జరిగిందని కెసిఆర్ చేసిన ఆరోపణను మీడియా ప్రతినిధులు చేసిన ప్రస్తావనపై ఆయన స్పందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విద్యార్థులకు చెల్లించే డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్తాయని, ఇందులో కుంభకోణం జరిగిందనడం అన్యాయమైన ఆరోపణ అని ఆయన అన్నారు.

పథకాన్ని రద్దు చేయాలనే దురుద్దేశంతోనే కెసిఆర్ ఇలాంటి సాకులను వెతుకున్నారని ఆయన అన్నారు. పిల్లలకు సొమ్ములు ఇవ్వాలనే ఆలోచన, మంచి ఉద్దేశం లేనప్పుడే ఇలాంటి ఆరోపణలు వస్తాయని జగన్ అన్నారు. వీళ్లు మనుషులేనా అని ఆయన అన్నారు.

గీత పార్టీ మారరు...

గీత పార్టీ మారరు...

తమ పార్టీకి చెందిన శ్రీకాకుళం జిల్లా అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారాన్ని జగన్ ఖండించారు.

మాకే అధిక సీట్లు

మాకే అధిక సీట్లు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తమ పార్టీకి 167 సీట్లు వస్తాయని వైయస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుపై కేసు పెట్టాలి..

చంద్రబాబుపై కేసు పెట్టాలి..

రాష్ట్ర ప్రజలను మోసం చేసిన చంద్రబాబుపై 840 కేసులు పెట్టాలని వైయస్ జగన్ అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అప్పుడే వ్యతిరేకత

అప్పుడే వ్యతిరేకత

చంద్రబాబుపై నెల రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అలాంటి పార్టీలోకి ఎవరైనా ఎందుకు వెళ్తారని జగన్ అన్నారు.

బాధితుల పరామర్శ

బాధితుల పరామర్శ

మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత వైయస్ జగన్ చెన్నై భవనం కూలిన సంఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించారు.

చెన్నై బాధితులకు ఓదార్పు

చెన్నై బాధితులకు ఓదార్పు

చెన్నైలో భవనం కూలిన ఘటనలో మరణించినవారి కుటుంబాలకు వెళ్లి వైయస్ జగన్ బాధితులను పరామర్శించారు.

జగన్ వైపు ఆశ్చర్యంగా...

జగన్ వైపు ఆశ్చర్యంగా...

చెన్నైలో భవనం కూలిన ఘటనలో మరణించివారి కుటుంబాలను పరామర్శించిన జగన్ తల పైకెత్తినప్పుడు పిల్లలు ఆయనను ఆసక్తిగా గమనించడం చూడవచ్చు.

English summary
YSR Congress president YS Jagan retaliated Telangana CM K Chandrasekhar Rao's comments on Fee Reimbursement scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X