చంద్రబాబును జుట్టుపట్టి లాగుదాం, ఉండేది మూడేళ్లే: జగన్

విజయనగరం/ విజయవాడ: భోగాపురం విమాశ్రయం కోసం ప్రభుత్వం సేకరించ తలపెట్టిన భూముల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సోమవారం భోగాపురం మండలం రావివలసలో ఎయిర్‌పోర్టు బాధితులు చేస్తున్న దీక్షకు ఆయన సోమవారం సంఘీభావం తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రైతాంగ వ్వతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. పచ్చని పంటపోలాలను సెజ్‌ల పేరిట రైతుల దగ్గర నుంచి భూములను బలవంతగా తీసుకుంటోందని జగన్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేదంటే ఉద్యమం తీవ్రం చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇష్టం లేకుండా సెంటు భూమి తీసుకోవడానికి ఎవరు వచ్చినా బాధితుల తరఫున వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. భూముల విషయంలో అవసరమైతే కోర్టును అశ్రయిస్తామని చెప్పారు. ఇదే ప్రాంతంలో పంచాయతీ రాజ్ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడికి చెందిన భూములు ఉన్నాయని, వాటిని వదిలి కేవలం రైతు భూములు మాత్రమే తీసుకుంటున్నారని జగన్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం తీసుకున్న భూములను వెనక్కి ఇస్తామని ఆయన అన్నారు.

ఇంత మంది ఉసురు పోసుకుని భూములు తీసుకునే అధికారం చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఉండేది మూడేళ్లు మాత్రమేనని, మూడేళ్లలో వైసిపి అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. గంటా, అయన్న, అవంతిల మేలు కోసమే ఎయిర్ పోర్టు నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు జుట్టు పట్టి లాగుదామని ఆయన అన్నారు.

 YS Jagan opposes land acquisition for Bhohapuram airport

రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారని వారు సోమవారం విజయవాడలో చెప్పారు.

జగన్ అక్టోబర్ 7వ తేదీన గుంటూరులోని నల్లపాడులో నిరవధిక నిరాహార దీక్ష చేస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని వారు విమర్శించారు ప్రత్యేక హోదా అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మూడు సార్లు ప్రధాని నరేంద్ర మోడీకి మూడుసార్లు లేఖలు రాశారని వారు గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నారనే భావన ప్రజల్లో ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+