చంద్రబాబుతో జగన్ పార్టీ నేత పొట్లూరి ప్రసాద్ భేటీ

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఝలక్ ఇవ్వడానికే పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆయన శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలుసుకున్నారు.

తాను టిడిపిలో చేరుతానని చెబుతూ తనకు విజయవాడ లోకసభ సీటు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పొట్లూరి వరప్రసాద్ చంద్రబాబును కోరారు. దీనిపై స్పందించిన చంద్రబాబు ఆ సీటు ఇప్పటికే వేరే నాయకుడికి కేటాయించామని ఆయనకు చెప్పారు.

potluri varaprasad

అయితే వేరే ఎక్కడయినా సీటు ఇవ్వాలని ప్రసాద్ అడినట్లు తెలియవచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, వ్యాపారసంబంధాలు పెట్టుకున్న పొట్లూరి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోయింది. సీమాంధ్రలో కూడా బలహీన పడుతున్నందని ఆలోచనతో ప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా పొట్లూరి ప్రసాద్‌పై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+