బాబు కోర్టు కన్నా పెద్దనేమో, రికార్డ్ చేశాను చూపించండి: జగన్ ట్విస్ట్
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు తాము కోర్టు కన్నా పెద్ద అనుకుంటున్నారని, తమతో మార్షల్స్ మాట్లాడిన తీరును రికార్డ్ చేశామని, వాటిని ప్రజలకు చూపించాలని వైసిపి అధినేత జగన్ మీడియాకు సూచించారు. గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చాక ఆయన మాట్లాడారు.
ఇవాళ అసెంబ్లీలో జరిగిన దానిని మనమంతా చూశామన్నారు. కోర్టు తీర్పును కూడా పక్కదారి పట్టిస్తున్నారన్నారు. స్పీకర్‌గా ఉన్న వ్యక్తి రూల్స్‌కు వ్యతిరేకంగా టిడిపికి కొమ్ము కాశారన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అనే అనుమానం కలుగుతోందన్నారు.
తమ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు డిస్‌క్వాలిఫై కాకుండా, వారిని కాపాడేందుకు రూల్స్ మార్చారని విమర్శించారు. కానీ అదే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రోజాను నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారని చెప్పారు.
అవిశ్వాసం నేపథ్యంలో టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు, 14 రోజుల తర్వాత చేపట్టాల్సిన చర్చను రూల్స్ మార్చి వెంటనే చేపట్టారన్నారు. అవినీతి సొమ్ముతో చంద్రబాబు మా పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. మొన్నటి దాకా మేం అనని మాటలను మేం అన్నట్లుగా చెప్పారన్నారు.

న్యాయవ్యవస్థ పైన తాను సభలో ఏం అననప్పటికీ అన్నట్లుగా టిడిపి నేతలు ఆరోపించారన్నారు. ఇవాళ మరీ దారుణం అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పునే వారు బేఖాతరు చేస్తున్నారన్నారు. మేం కోర్టుల కంటే పెద్ద వాళ్లమన్నట్లుగా వారు వ్యవహరిస్తూ కోర్టు ఆర్డర్‌ను తీసుకోవడం లేదన్నారు.
నేను ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు అసెంబ్లీకి వెళ్లానని, అప్పటి నుంచి రోజాను లోపలకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాను అక్కడే అందరి ఎమ్మెల్యేలతో పాటు ఉన్నానని చెప్పారు. గంటన్నర పాటు మేం అక్కడే ధర్నా చేశామన్నారు. ఏం చేయలేక గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చామన్నారు.
ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని, తమ హక్కులను కాపాడాలని తాము గవర్నర్‌ను కోరామని జగన్ చెప్పారు. దీనిని తాము కోర్టు దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. సోమవారం కోర్టు ఆదేశాలతో మళ్లీ హుందాగా అసెంబ్లీలోకి రోజా అడుగు పెడతారన్నారు.
రోజాను నడి రోడ్డు పైన విడిచి పెట్టలేక మేం అసెంబ్లీకి వెళ్లలేదని చెప్పారు. మేం రోజాకు తోడుగా నిలబడుతున్నామన్నారు. రోజాకు మేం అండగా ఉంటామని చెప్పారు. మార్షల్స్‌తో మాట్లాడేప్పుడు మేం రికార్డ్ చేశామని, దానిని మీడియాకు ఇస్తున్నామని చెప్పారు. దీనిని ప్రజలందరికి తెలిసేలా ప్లే చేయాలన్నారు. వీరికి బుద్ధి వచ్చేవిధంగా దేవుడు చేస్తాడన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications