జగన్, చంద్రబాబు, పవన్ ఓటు వేసేది ఎక్కడ..!!

ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఓటింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది. గతం కంటే ఈ సారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకావం కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పార్టీల అధినేతలు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకోవటానికి సద్దమయ్యారు. ఏపీలో ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సొంత ప్రాంతాలకు తరలి వస్తున్నారు.

ఈ నెల 13న జరిగే పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. సీఎం జగన్ ఈ రోజు పులివెందులకు వెళ్తున్నారు. దాదాపు రెండు నెలల పాటు ప్రచార హోరెత్తించిన జగన్ పిఠాపురం సభతో తన ప్రచారం ముగించారు. గెలుపు పైన జగన్ ధీమాతో ఉన్నారు.

YS Jagan to cast his vote in Pulivendula Chandra Babu in Mangalagiri along with family members

ఈ సాయంత్రం సతీమణి భారతితో కలిసి పులివెందులకు వెళ్తున్నారు. రేపు తాను పోటీ చేస్తున్న సొంత నియోజకవర్గంలోనేని బాకరాపురంలో ఓటు వేయనున్నారు. ప్రతీ ఎన్నిక లోనే ఓటు వేస్తారు. ఈ రోజు, రేపు పులివెందులలోనే ఉంటారు. రాత్రి పులివెందులలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళగిరి పరిధిలో ఓటు వేయనున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఉండవల్లిలోని పోలింగ్ బూత్‌లో సతీమణి భువనేశ్వరి, కుమారుడు..మంగళగిరి అభ్యర్ది లోకేష్, కోడలు బ్రాహ్మణి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

జనసేనాని పవన్ కల్యాణ్ సైతం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోనే తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తాజాగా ఓటు నమోదు చేసుకున్న పవన్ ఈ సారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు పైన పిఠాపురంలో ఉత్కంఠ కొనసాగుతోంది. కుప్పం, మంగళగిరి, పిఠాపురం, హిందూపురం, ఉండి ఫలితాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+