ఇక ఢిల్లీ కేంద్రంగా - జగన్ అనూహ్య నిర్ణయం..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సమయాన మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జగన్ సైతం పార్టీ వీడిన నేతల నియోజకవర్గాల పైన ఫోకస్ చేసారు. కొత్త ఇంచార్జ్ లను ఎంపిక చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పరంగా కీలక కార్యాచరణ అమలుకు జగన్ సమాయత్తం అవుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ చేసారు. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయాలకు సిద్దం అయ్యారు. పార్టీ వీడిన ముఖ్య నేతల నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్టీని వీడటం తో అక్కడ వైసీపీ కేడర్ తో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఆళ్ల నాని స్థానంలో పార్టీ నుంచి కొత్త ఇంఛార్జ్ ను జగన్ ప్రకటించనున్నారు. అదే విధంగా ఒంగోలు విషయంలోనూ జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, తానే ఒంగోలు వెళ్లి పార్టీ కేడర్ తో ప్రత్యేకం గా భేటీ అవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా వివిధ కేసుల్లో అరెస్ట్ అయిన పార్టీ నేతల నియోజకవర్గాల్లోనూ కేడర్ తో జగన్ సమావేశాలకు సిద్దం అవుతున్నారు.

ys-jagan-to-meet-with-party-key-leaders-ahead-parliament-sessions-details-here

కాగా, జగన్ ఇక పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో.. పార్టీకి చెందిన రాజ్యసభ.. లోక్ సభ ఎంపీలతో జగన్ రేపు (గురువారం) సమావేశం అవుతున్నారు. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో నిర్మాణాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే నిరసనలో భాగంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్ ను కలిసారు. ఇప్పుడు పార్టీ ఎంపీల భేటీలో పార్లమెంట్ వేదికగా ప్రజలకు సేవ చేయాల్సిన రంగాల్లో పీపీపీ విధానంకు వ్యతిరేకంగా గళం విప్పాలని నిర్దేశించనున్నారు. అదే విధంగా రాయలసీమ లిఫ్టు పైనా ఎంపీలకు జగన్ కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఢిల్లీ వేదికగా ఎంపీలకు కార్యాచరణ ఫిక్స్ చేయనున్నారు. ఎన్డీఏలో టీడీపీ - జనసేన భాగస్వామిగా ఉండటంతో... ఇక ఢిల్లీలోనూ తమ వాయిస్ బలంగా వినిపించేలా జగన్ కీలక నిర్ణయం ఈ భేటీలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+