గూగుల్ ట్రెండ్స్: కూతురు-పీకే.. పవన్ కళ్యాణ్ కంటే జగన్‌కే ఎక్కువ, పార్టీల్లో టీడీపీ

Recommended Video

    గూగుల్ ట్రెండ్స్: పవన్ కళ్యాణ్ కంటే జగన్‌కే ఎక్కువ

    అమరావతి: గూగుల్ ట్రెండ్స్‌లో వ్యక్తిగతంగా చూస్తే వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి, పార్టీ పరంగా చూస్తే తెలుగుదేశం గురించి ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారట. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు.

    ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి గూగుల్ ట్రెండ్స్ లెక్కల్లో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. ట్రెండ్స్ లెక్క ప్రకారం.. జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత ఆయన గురించి నెటిజన్లు వెతికే వైఖరిలో మార్పు వచ్చిందట.

    జగన్ పాదయాత్రకు ముందు

    జగన్ పాదయాత్రకు ముందు

    జగన్ పాదయాత్ర ప్రారంభించకముందు జగన్ కేసుల గురించి, బెంగళూరులోని ఆయన విలాసవంతమైన భవనం గురించి నెటిజన్లు ఎక్కువగా వెతికే వారని, కానీ ఇప్పుడు మాత్రం యాత్ర ప్రారంభమయ్యాక ఆయన యాత్రకు సంబంధించిన విషయాలు వెతుకుతున్నారట.

    జగన్ కూతురు, ప్రశాంత్ కిషోర్

    జగన్ కూతురు, ప్రశాంత్ కిషోర్

    జగన్ ప్రజా సంకల్ప యాత్రతో పాటు జగన్ కూతురు గురించి, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారట. సరాసరిగా జగన్‌కు సంబంధించిన 25 ప్రశ్నలను తీస్తే అంతులో 22 పాదయాత్ర కు సంబంధించినవి ఉన్నాయంటున్నారు. మిగిలిన వాటిలో పారడైజ్ పేపర్స్, జగన్ కూతురు, ప్రశాంత్ కిషోర్‌ల గురించి ఉన్నాయి.

    చంద్రబాబు కంటే జగన్‌కే ఎక్కువ

    చంద్రబాబు కంటే జగన్‌కే ఎక్కువ

    గత పన్నెండు నెలలుగా చంద్రబాబు కంటే జగన్‌నే నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేశారట. రాజకీయ పార్టీ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ ముందు ఉంది. ఆ తర్వాత స్థానంలో జనసేన ఉండగా, వైసీపీ మూడో స్థానంలో ఉందట.

    ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇలా

    ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇలా

    సోషల్ మీడియాను వైసీపీ దుర్వినియోగం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడుతున్నారు. పాదయాత్రకు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారానైనా ఆకట్టుకోవాలని వైసీపీ భావిస్తోందని అంటున్నారు.

    ప్రశాంత్ కిషోర్‌ను అడ్డం పెట్టుకొని

    ప్రశాంత్ కిషోర్‌ను అడ్డం పెట్టుకొని

    ప్రశాంత్ కిషోర్‌ను అడ్డం పెట్టుకొని ఇంటర్నెట్లో వైసీపీకి విశేష ఆదరణ ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అంటున్నారు. అయితే తమకూ, సోషల్ మీడియా టీంకు ఎలాంటి సంబంధం లేదని ప్రశాంత్ కిషోర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. టీడీపీ ఆరోపణలను వైసీపీ నేత అంబటి రాంబాబు కొట్టి పారేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+