ట్యాంక్ శుభ్రం చేయలేదు: వైసీపీ చీఫ్, జగన్‌కు 131వ ర్యాంక్ ఇచ్చిన బాబు

విజయవాడ: ఐదేళ్లుగా వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. కృష్ణా జిల్లాలోని కొత్తమాజేరులో ఆయన విష జ్వర బాధిత కుటుంబాలని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

విష జ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారని మండిపడ్డారు. గత కొన్ని నెలలుగా ఇక్కడ 18 మంది వరకు మృతి చెందారని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. నాలుగు రోజుల్లోనే ఐదు రోజులు మరణించారన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి లేదా ముఖ్యమంత్రి గాని ఇప్పటి వరకు ఇక్కడకు రాలేదన్నారు. వారు వచ్చి వెళ్లి ఉంటే పరిస్థితి తీవ్రత గురించి తగిన చర్యలు తీసుకుంటే.. ఇంతమంది మరణించే వారు కాదన్నారు. గ్రామంలో 18 మంది చనిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.

YS Jagan tour in Krishna district

గత మూడు నాలుగు నెలలుగా విష జ్వరం ఒకరి నుండి మరొకరికి వస్తోందన్నారు. ఒకే గ్రామంలో నాలుగు రోజుల్లోనే ఐదుగురు మృతి చెందారన్నారు. ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఇప్పటికీ పరిస్థితి ఇలాగే ఉండటం దారుణమన్నారు. ఇక్కడున్న వాటర్ ట్యాంకును ఐదేళ్లుగా శుభ్రం చేయలేదని, ట్యాంకులో కోతుల కళేబరాలు ఉన్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పని తీరుకు 131వ ర్యాంక్ ఇచ్చారు. కాగా, ర్యాంకుల్లో బాలకృష్ణకు మొదటి ర్యాంక్ వచ్చిన విషయం తెలిసిందే.

పనితీరులో జగన్ విఫలమయ్యారు కాబట్టే ఆయనకు 131వ స్థానం వచ్చిందని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. కడప, పులివెందులకు జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. వనజాక్షికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+