పులివెందులకు జగన్, ఫ్యామిలీతో కలిసి - కీలక నిర్ణయం..!!

మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన ఖరారైంది. రెండు రోజులు జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి నాడు ఇడుపులపాయ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించనున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీ నేతలకు జగన్ కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. పులివెందుల పైన కూటమి ఫోకస్ చేయటంతో.. ఇక్కడ గెలుపు పైన కొత్త వ్యూహాలు.. కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

మాజీ సీఎం జగన్ రేపు (మంగళవారం) నుంచి రెండు రోజులు పులివెందులలో పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరు కుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. సెప్టెంబర్‌ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకొని అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తరువాత జగన్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ లో జరిగే ప్రత్యేక ప్రార్ధనలకు హాజరవుతారు.

జనసేనలోకి బొత్సా సత్యానారాయణ..? క్లారిటీ వచ్చేసింది..!!
జనసేనలోకి బొత్సా సత్యానారాయణ..? క్లారిటీ వచ్చేసింది..!!
ys-jagan-two-days-visit-in-pulivendula-from-september-1st-to-pay-ysr-tributes-at-idupulapaya

స్థానిక నేతలకు కీలక దిశా నిర్దేశం

ఇదే సమయంలో పులివెందులలో ప్రజా దర్బార్ లో జగన్ పాల్గొంటారు. అదే విధంగా స్థానిక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీ నేతలకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రధానం గా కడప జిల్లాతో పాటుగా పులివెందుల మున్సిపాల్టీలో ఎలాగైనా విజయం సాధించాని.. అవకాశం మేర ఏకగ్రీవం చేసుకోవాలని టీడీపీ నేతలు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. దీంతో.. ఏకగ్రీవానికి అవకాశం లేకుండా.. పోటీ చేయటంతో పాటుగా పట్టు నిరూపించుకునే విధంగా పార్టీ నేతలకు జగన్ కార్యాచరణ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. పులివెందులలో స్థానిక ఎన్నికలు టీడీపీ, వైసీపీకి ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో.. జగన్ ఈ పర్యటనలో స్థానిక నేతలకు చేసే దిశా నిర్దేశం.. తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+