అక్టోబర్ 24న రాహువు నక్షత్రంలోకి సూర్యుడు.. 5 రాశులవారికి కష్టాల సునామీ!

అక్టోబర్ 24, 2026 నుంచి సూర్యుడు రాహువు అధిపత్యం వహించే స్వాతి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. నవంబర్ 6 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. రాహువును కీడు గ్రహం గా చెడు చేసే గ్రహం గా చెప్తారు. అటువంటి రాహువు, సూర్యుడు ఒకరికొకరు శత్రువులు కావడంతో కొన్ని రాశుల వారికి ఈ కాలం కాస్త కష్టంగా ఉండొచ్చు. ముఖ్యంగా డబ్బు వ్యవహారాలు, వ్యాపారంలో జాగ్రత్త అవసరం.

మేష రాశి

సూర్యుడు మీ ఏడో ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీనివలన మేషరాశి జాతకులకు కలిసి రాదు. కొత్త పెట్టుబడులు ఈ సమయంలో మంచిది కాదు . పెద్ద నష్టాలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు, పని ఒత్తిడి, నిద్రలేమి వల్ల మానసిక అసంతృప్తి కలగొచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన వారితో సంబంధాల్లో చిక్కులు రాకుండా చూసుకోండి.

Sun transit Rahu Swati Nakshatra on 24 October 2026 5 Zodiac Signs Must Be Careful with Money

మీన రాశి

సూర్యుడు మీనరాశిలో ఎనిమిదో ఇంట్లో సంచారం మీనరాశి జాతకులకు అమంగళకరంగా ఉంటుంది. ఓపిక పరీక్షకు నిలవాల్సి వస్తుంది. డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త. అనవసర మార్గాల్లో డబ్బు సంపాదించకండి. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త. కుటుంబంలో వాదాలు, తల్లిదండ్రులతో అసమ్మతి రావచ్చు. కొత్త పనులు మొదలుపెట్టకండి.

కుంభ రాశి

ఈ కాలం కుంభరాశి జాతకులకు అంతగా అనుకూలం కాదు. ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతాయి. డబ్బు రాకపోకలు కష్టంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సన్నిహితులే శత్రువులుగా మారే అవకాశం ఉంది. పాత అప్పులు ఎక్కువగా బాధించవచ్చు. మనశ్శాంతి దెబ్బతినకుండా పాలు లేదా గంగాజలంతో శివునికి అభిషేకం చేయండి. ఈ కాలంలో డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండి, అనవసర నష్టాలు నివారించుకోండి.

అక్టోబర్ లో ఆశ్లేష నక్షత్రంలో గురుసంచారం – కన్యా సహా ఈ ఆరు రాశులవారికి సంపన్న యోగం!
అక్టోబర్ లో ఆశ్లేష నక్షత్రంలో గురుసంచారం – కన్యా సహా ఈ ఆరు రాశులవారికి సంపన్న యోగం!

మిథున రాశి

మిథున రాశి జాతకులకు సూర్యుడు రాహువు నక్షత్రంలో సంచారం చేయటం అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి ఏ పని చేసినా కలిసి రాదు. కష్టాల సునామీలో కొట్టు మిట్టాడుతారు. ఇది మిథునరాశి వారికి నష్ట కాలం

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు సూర్యుడు రాహువు నక్షత్రం అయిన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం అన్ని విధాలా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయం వృశ్చిక రాశి వారికి అంతగా మంచిది కాదు. ఈ సమయంలో అలోచించి నిర్ణయం తీసుకోవాలి.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+