ఒత్తిడిలో జగన్: ఆనం, చంద్రబాబుకు శుభాకాంక్షలు
హైదరాబాద్/విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించినవేనని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. పార్టీ ఓటమిపై సమీక్షించుకుంటామని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మరో కాంగ్రెస్ నేత, మాజీ పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా టిడిపికి శుభాకాంక్షలు తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు.

డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా?: నారాయణ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలున్నాయా అని సిపిఐ రాష్ట్ర నేత నారాయణ ప్రశ్నించారు. సిపిఎం నాయకులు చేస్తున్న ఆరోపణలు నేపథ్యంలో నారాయణ పై వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని సిపిఎంను డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకున్న ఆరోపణలపై కోర్టులో తేల్చుకుందామని నారాయణ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications