శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాధితులకు జగన్ పరామర్శ: కంటతడి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: హుధుద్ తుఫాన్ వల్ల అపారనష్టం వాటిల్లి జనం ఇబ్బంది పడుతుంటే కనీస సహకారం కూడా ప్రభుత్వం అందించలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలు, రూరల్, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి, మంత్రులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 25 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నెలవారీ ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ తెల్లకార్డుదారులకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తుఫాన్ సహాయాన్ని పార్టీ కార్యకర్తల పర్యవేక్షణలో బాధితులకు అందించడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇటువంటి అప్రజాస్వామిక కార్యకలాపాలను నిరసిస్తూ నవంబర్ 5న అన్ని మండలకేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద వైయస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. బాధితులకు సాయమందేవరకూ వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టంచేశారు. రుణమాఫీ మాట ఎలా ఉన్నా.. కనీసం రుణాల రీషెడ్యూల్ జరుపలేకపోయారని, నష్టపోయిన పంటలకు బీమా అందించలేకపోయారని దుయ్యబట్టారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

హుధుద్ తుఫాన్ వల్ల అపారనష్టం వాటిల్లి జనం ఇబ్బంది పడుతుంటే కనీస సహకారం కూడా ప్రభుత్వం అందించలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలు, రూరల్, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లో ఆయన పర్యటించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి, మంత్రులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

25 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు నెలవారీ ఇవ్వాల్సిన బియ్యం ఇప్పటికీ తెల్లకార్డుదారులకు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

తుఫాన్ సహాయాన్ని పార్టీ కార్యకర్తల పర్యవేక్షణలో బాధితులకు అందించడం విడ్డూరంగా ఉందన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఇటువంటి అప్రజాస్వామిక కార్యకలాపాలను నిరసిస్తూ నవంబర్ 5న అన్ని మండలకేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల వద్ద వైయస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.

కంటతడి పెట్టిన బాధితులు

కంటతడి పెట్టిన బాధితులు

బాధితులకు సాయమందేవరకూ వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టంచేశారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy on Tuesday visited cyclone affected areas in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X