Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'సెంట్రల్ జైలుకు పంపుతా, అవినీతి పరులే, జగన్ సంచలన వ్యాఖ్యలు'

దివాకర్ బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్ళిన వైసిపి అధినేత జగన్ నందిగామ ప్రభుత్వాసుపత్రిలో హల్ చల్ చేశారు.డ్రైవర్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ను డాక్టర్ నుండి తీసుకొనేందుకు జగన్ ప్రయత్

నందిగామ:నందిగామ ప్రభుత్వాసుపత్రిలో వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ హల్ చల్ చేశారు. బస్సు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ పోస్టుమార్టమ్ రిపోర్ట్ ను డాక్టర్ నుండి లాక్కొన్నారు.అడ్డుకోబోయిన జిల్లా కలెక్టర్ పై జగన్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు.జగన్ వద్ద నుండి కలెక్టర్ డ్రైవర్ పోస్టు మార్టమ్ రిపోర్ట్ ను తిరిగి లాక్కోవడంతో కలెక్టర్ పై జగన్ నిప్పులు చెరిగారు.సెంట్రల్ జైలుకు పంపుతానంటూ బెదిరించారు.

మంగళవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా ముళ్ళపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కల్వర్టులో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా,

మరో 30 మంది గాయపడ్డారు.అయితే ఈ ఘటనలో గాయపడిన వారిని మిపరామర్శించేందుకు వచ్చిన జగన్ నందిగామ ప్రభుత్వాసుపత్రికి హంగామా చేశారు.

ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఇచ్చేందుకు డాక్టర్లు నిరాకరించడంతో డాక్టర్ నుండి పోస్టుమార్టం రిపోర్టును జగన్ లాక్కొన్నారు.అక్కడే ఉన్న కలెక్టర్ అభ్యంతరం చెప్పడంతో జగన్ తీవ్రస్థాయిలో ఆగ్రహించారు.

జగన్ దగ్గర నుండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కలెక్టర్ వెనక్కి తీసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వావాదం చోటుచేసుకొంది. పోలీసులు, కలెక్టర్ అందరూ అవినీతిపరులేనని జగన్ వ్యాఖ్యానించారు. వారిని సెంట్రల్ జైలుకు పంపుతానని హెచ్చరించారు.

ys jagan

డాక్టర్ వద్ద నుండి జగన్ లాక్కొంది పోస్ట్ మార్టం రిపోర్ట్ కాదని ఆంద్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు చెప్పారు.అదనపు డాక్టర్లతో పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం చేస్తున్నామని కామినేని చెప్పారు.

శవాలతో కూడ జగన్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కామినేని విమర్శించారు. జగన్ కోసం మృతదేహలను ఉంచాలనుకోవడం దారుణమన్నారు. రెండవ డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని మంత్రి కామినేని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+