వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఐదేళ్ల తర్వాత ఏపీలో టీడీపీ ఉండదు.. రాబోయే 30 ఏళ్లూ జగనే సీఎం’

|
Google Oneindia TeluguNews

కలియుగదైవం తిరుమల శ్రీవారి సమక్షంలో నిలబడి.. టీడీపీకి ఫ్యూచర్.. వైసీపీ భవిష్యత్ కార్యాచరణపై.. రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుమల ఆలయాకొచ్చిన ఆయన.. వెంకన్న దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు.

సంకల్పం అదే..

సంకల్పం అదే..


ఐదేళ్ల తర్వాత ఏపీలో అసలు టీడీపీ అనే పార్టీ ఉండదని, సీఎం జగనే టీడీపీని నామరూపాలు లేకుండా చేసేస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. అలాగే, రాష్ట్రంలో వచ్చే 30 ఏళ్లపాటూ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ప్రజల సంకల్పం కూడా అదేనని అన్నారు. అయితే టీడీపీని జగన్ ఏవిధంగా చావగొడతారనేది మాత్రం మంత్రి వివరించలేదు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెద్దిరెడ్డి కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

బాబు ప్లాన్ ఇదే..

బాబు ప్లాన్ ఇదే..

ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు తలపెట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర'పైనా మంత్రి విమర్శలు చేశారు. ఎన్నికల్లో జనం స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబుకు బుద్ధిరాలేదని, రాష్ట్రంలో లేనిపోని అలజడి సృష్టించడం కోసమే బస్సు యాత్ర చేస్తున్నాడని అన్నారు. ‘‘చంద్రబాబు చేసవన్నీ తప్పుడు ఆలోచనలే. బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవాలన్నదే ఆయన అభిమతం. అరెస్టు కావడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందొచ్చనే పిచ్చి ఆలోచన తనది''అని మంత్రి వివరించారు.

పెద్దిరెడ్డి పెద్ద దొంగ: చంద్రబాబు

పెద్దిరెడ్డి పెద్ద దొంగ: చంద్రబాబు


ప్రజల్ని అన్నిరకాలుగా దోచుకుంటూ, ప్రతిపక్ష పార్టీలను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతోన్న సీఎం జగన్ ఏపీలో రాక్షసపాలన సాగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర(బస్సు యాత్ర) కొనసాగిస్తున్న ఆయన.. సాక్షాత్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారామే ఇసుకను దొంగతనంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి బేసిగ్గా కాంట్రాక్టర్‌ అని.. ఇప్పుడాయన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడంతో దొంగ చేతికే తాళం దొరికినట్లయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Recommended Video

Peddireddy Ramachandra Reddy Press Meet | Local Body Elections | Oneindia Telugu
శ్రీకాళహస్తికి ఆయనే ముఖ్యఅతిథి..

శ్రీకాళహస్తికి ఆయనే ముఖ్యఅతిథి..

చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాగరాత్రి, నాలుగో తిరునాళ్ల వేడుకను ఘనంగా నిర్వహించారు. హంస, చిలుక వాహనాలపై స్వామివారిని ఊరేగించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రికి శేష, యాళి వాహన సేవలు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి ఆలయానికొచ్చి ఇవాళ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

English summary
ap minister peddireddy ramachandra reddy visits tirumala temple on thursday. while speaking with media he said, ys jagan will destroy opposition tdp within 5 years and will continue as cm for 30 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X