'జగన్ త్వరలో జైలుకు, ఓఎల్ఎక్స్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ'

వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లక తప్పదని, అప్పుడు ఆయన స్థాపించిన పార్టీని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టక తప్పదని టిడిపి నేత పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లక తప్పదని, అప్పుడు ఆయన స్థాపించిన పార్టీని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టక తప్పదని టిడిపి నేత పయ్యావుల కేశవ్ బుధవారం ఎద్దేవా చేశారు.

అవినీతి మూలాలపై చర్చ జరగకూడదనే వైసిపి అధినేత జగన్ యాత్రలు చేపడుతున్నారన్నారు. నల్లధనం, జగన్మోహన్ రెడ్డి అవిభక్త కవలలు అన్నారు. జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

YS Jagan will go to jail soon says, Payyavula

అంతేకాకుండా నల్లధనం మూలాలను జగన్‌ వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ను ఆదాయ పన్ను శాఖ, ఈడీ వదిలిపెట్టవన్నారు. త్వరలో ఆయన జైలుకు వెళ్లక తప్పదన్నారు. అప్పుడు పార్టీని అమ్మకానికి పెట్టక తప్పదన్నారు.

దేశంలోనే జగన్ అతిపెద్ద నల్లధన సామ్రాట్ అన్నారు. జగన్ కంపెనీలకు అన్ని పెట్టుబడులు ఎలా వచ్చాయో, వ్యాపార లావాదేవీలు జనాలకు చెప్పాలన్నారు. జగన్ రూ.10 షేర్‌ను రూ.14,000కు అమ్మారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+