వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తేదీ ఇదే

YS Jagan oath taking ceremony: ఏపీలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీపై నిలిచింది. ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

ఈ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డీ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. 151కి పైగా అసెంబ్లీ, 22 లోక్‌సభ నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తామంటూ ఐప్యాక్ టీమ్ సమావేశంలో స్వయంగా వెల్లడించారు కూడా. అటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇదే ధీమా వ్యక్తమౌతోంది.

YS Jagan s oath taking ceremony as 2nd term CM of AP on June 9 says Botcha Satyanarayana

ఈ క్రమంలో వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకార తేదీని సైతం ఖరారు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. సాగరనగరం విశాఖపట్నంలో జూన్ 9వ తేదీన జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన వెంటనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు.

విజయవాడలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు కొనసాగిస్తామని అన్నారు. వాటిని చూసి ప్రజలు తమకు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చామని, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాతా వాటిని నిలుపుకొంటామని చెప్పారు.

తమపై ప్రజల్లో విశ్వసనీయత ఉందని, అందుకే ఉవ్వెత్తున పోలింగ్‌ బూత్‌లకు బారులు తీరారని, తమకు అనుకూలంగా ఓటు వేశారని అన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యంగులు, ప్రజలు అందరూ జగన్‌ని ఆశీర్వదించారని, తమ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని బొత్స సత్యనారాయణ చెప్పారు.

జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ సందర్భంగా భారీ మోజారిటీతో తాము అధికారంలోకి వస్తామని ఆయన అన్నారు. జూన్‌ 9వ తేదీన రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖలో జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ప్రజలందరూ కూడా వైఎస్ జగన్‌ రావాలని కోరుకున్నారని, తమ ప్రేమాభిమానాలను ఓటు రూపంలో తెలియజేశారని బొత్స వ్యాఖ్యానిొంచారు.

తెలుగుదేశం ఓడిపోతోందని, ఆ విషయం ఆ పార్టీ నాయకులకు కూడా తెలుసునని బొత్స అన్నారు. అందుకే సహనం కోల్పోయి దాడులకు తెగబడుతున్నారని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ సాగిస్తోన్న అల్లర్లకు ప్రతీకార దాడులపై తమ నాయకుడు కూడా స్పందిస్తే వేరేలా ఉండేదని బొత్స చెప్పారు.

YS Jagan s oath taking ceremony as 2nd term CM of AP on June 9 says Botcha Satyanarayana

చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మంచి సంప్రదాయం కాదని, సంయమనం పాటించాలని జగన్ కోరారని చెప్పారు. రేపు ప్రభుత్వాన్ని నడపాల్సింది, శాంతిభద్రతలను కాపాడాల్సింది తామేనని, అందుకే బాధ్యతగా వ్యవహరిస్తున్నామని వివరణ ఇచ్చారు. నాలుగైదు రోజులు సంయమనం పాటిస్తే అన్నీ సర్ధుకుపోతాయని చెప్పారు.

తానే గెలుస్తానంటూ చంద్రబాబు నాయుడు చేస్తోన్న వ్యాఖ్యల్లో అర్థం లేదని బొత్స విమర్శించారు. ఏ ప్రాతిపదికన ఆయన ఇలాంటి ప్రకటన చేస్తోన్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు గానీ, టీడీపీకి గానీ ప్రజలు ఎందుకు ఓటేస్తారని అన్నారు. జగన్‌ను తిట్టి ఓటేయమన్నాడే తప్ప చంద్రబాబు చేసిందేముందని బొత్స ప్రశ్నించారు.

జూన్ 4వ తేదీ వరకూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు గోల చేస్తూనే ఉంటారని, వాటిని భరించక తప్పదని పేర్కొన్నారు బొత్స. పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు నుంచీ టీడీపీ అనుకూల పత్రికలు ల్యాండ్ టైట్లింగ్ గురించి గురించి ఒక్క రాత కూడా రాయవని తాను గతంలో చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందని బొత్స చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+