బాబు, బాలయ్య, లోకేష్ వీడియోలతో జగన్ సంచలన ట్వీట్..!
ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా అమరావతిలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్ట్ కృష్ణంరాజుతో పాటు సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన మరో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. ఇదే క్రమంలో కొమ్మినేనిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. తాజా పరిణామాలపై వైసీపీ మండిపడుతోంది. దీనిపై స్పందిస్తూ ఇవాళ వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం సమర్ధత, పారదర్శకత, అవినీతి రహిత పరిపాలన, న్యాయం-ఆధారిత విధానం, విప్లవాత్మక సంక్షేమ కార్యక్రమాలకు పేరు పొందిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మోసపూరితంగా ఉందని జగన్ ఆరోపించారు. ఇది అపఖ్యాతి పాలైన రెడ్ బుక్ పాలనతో నడిచే అస్తవ్యస్తమైన, నిరంకుశ పాలనగా కనిపిస్తుందన్నారు. తన గొప్ప సంక్షేమ వాగ్దానాలను నెరవేర్చడంలో అసమర్థుడు, ప్రజలను మోసగించిన బాబు, తన వైఫల్యాలను దాచడానికి ప్రయత్నిస్తూ గందరగోళాన్ని సృష్టించడం ద్వారా ప్రజల దృష్టి మరల్చడానికి ఎంచుకున్నారంటూ విమర్శించారు.

సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్యలకు తప్పుగా ఇరికించి అరెస్టు చేయడం వాస్తవానికి చట్ట అమలు కాదని, ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారమని జగన్ తెలిపారు. ఆయన కేవలం చర్చను నియంత్రించారని, దానికి బాధ్యులుగా చేయడం ఎంత అన్యాయం, అసంబద్ధమని ప్రశ్నించారు. బాబు ప్రభుత్వం కథనాన్ని వక్రీకరించిందని, మహిళల గౌరవాన్ని కాపాడటం అనే ముసుగులో సాక్షి మీడియా కార్యాలయాలపై హింసాత్మక, రాష్ట్రవ్యాప్త దాడులను నిర్వహిస్తోందని ఆరోపించారు.
Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by @ncbn’s government which is seemingly a chaotic, authoritarian regime driven… pic.twitter.com/KpZbRPB6BW
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 10, 2025
ఇలా మహిళల గౌరవం కాపాడతామని చెబుతున్న వారి ఈ వీడియోలు వారి నిజమైన వైఖరిని స్పష్టంగా ప్రతిబింబిస్తాయని జగన్ తెలిపారు. ఈ ట్వీట్ కు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గతంలో మాట్లాడిన మాటల వీడియోల్ని జత చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా రాష్ట్రంలో ఒక సంవత్సరంలో 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరిగాయన్నారు. ఇటీవలే, అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ గిరిజన విద్యార్థినిని హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పారేసిన దారుణమైన దాడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయన్నారు.
ఎడ్గురాళ్లపల్లిలో, 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది వ్యక్తులు ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారని, ఆమె గర్భవతి అయిందని జగన్ ఆరోపించారు. బాధితురాలి కుటుంబం రాజకీయ ఒత్తిడి , పోలీసుల నిష్క్రియాపరత్వానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణల మధ్య అదృశ్యమైందన్నారు. వారు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా అని ప్రశ్నించారు. వారు కాపాడిన గౌరవం ఇదేనా? స్పష్టంగా, వారి చర్యలు, మహిళల పట్ల వైఖరి రెండూ అవమానకరమైనవి , గౌరవం ముసుగులో వారు పగ పెంచుకునే కేసులు నమోదు చేయడం అసహ్యకరమైనదని జగన్ విమర్శించారు.












Click it and Unblock the Notifications