YS Sharmila: షర్మిల కు రాజ్యసభ సీటు అడ్డుకుంటుందెవరు, మారుతున్న లెక్కలు..!?
ఏపీ కేంద్రంగా రాజకీయ లెక్కలు మారుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తరువాత కాంగ్రెస్ తిరిగి బలం పెంచుకోవటం పై ఆశలు పెంచుకుంది. పీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పగించినా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అయితే, ఇప్పుడు ఏపీ కేంద్రంగా కాంగ్రెస్ కొత్త కార్యాచరణ ఖరారు చేసింది. ఇదే సమయంలో షర్మిలకు రాజ్యసభ సీటు పై ఇచ్చిన హామీ అమలు కాకపోవటం పైన చర్చ జరుగుతోంది. అసలు షర్మిలను పెద్దల సభలోకి పంపటానికి ఆలస్యం వెనుక అసలు కారణం ఏంటనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో తాజాగా పీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీలో నిరసనలకు హాజరు కావాలని రాహుల్ ను ఆహ్వానించారు. రాహుల్ సైతం అంగీకరించినట్లు వెల్లడించారు. ఇక.. ఇదే సమయంలో షర్మిల కేంద్రంగా కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల.. ఆ తరువాత కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసారు. ఆ సమయంలోనే షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ దక్కినట్లు ప్రచారం సాగింది. ఆ తరువాత షర్మిలను పీసీసీ చీఫ్ గా 2024 ఎన్నికల ముందు నియమించారు. కడప నుంచి పోటీ చేసిన షర్మిల ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక.. పీసీసీ చీఫ్ గా కొనసాగుతుండగానే.. రాజ్యసభకు నామినేట్ చేయటం పైన మరోసారి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయినా.. ఇప్పటి వరకు షర్మిలకు రాజ్యసభ సీటు దక్కలేదు. త్వరలో రాజ్యసభలో ఏకంగా 73 సీట్లు ఖాళీ అవుతున్నాయి.

కాంగ్రెస్ హైకమాండ్ కొత్త లెక్కలు
కాగా, ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్ కు 27 సీట్లు ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణా, హిమాచల్ ప్రదేశ్ ఇలా మూడింట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏడు సీట్లు ఇక్కడ ఖాళీ అవుతున్నాయి. ఇందులో కాంగ్రెస్ కి అయిదు కచ్చితంగా వస్తాయి. మహారాష్ట్ర, తమిళనాడు అసోం వంటి చోట్ల కలుపుకుంటే ఒకటి రెండు దక్కనున్నాయి. అయితే, తెలంగాణ నుంచి షర్మిలను రాజ్యసభకు పంపే ఆలోచన చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరిగింది. తెలంగాణలో పార్టీ పదవులు దక్కని సీనియర్ల కు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని...అక్కడి నుంచి ఇతర రాష్ట్రాల వారికి అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
కర్ణాటక నుంచి ఛాన్స్ ఉంటుందా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ను తెలంగాణ కోటాలో రాజ్యసభకు పంపుతారని సమాచారం. దీంతో.. షర్మిలకు ఈ సారి రాజ్యసభ అవకాశం దక్కటం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు షర్మిలను రాజ్యసభకు పంపటం పైన పార్టీ అధినాయకత్వం చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. వచ్చే నెల నుంచి ఏపీలో కాంగ్రెస్ అధి నాయకత్వం కొత్త కార్యాచరణ అమలు చేసేందుకు కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications