జగన్ తో పోరు షర్మిలకు ఇష్టం లేదా? ఆప్షన్ లేకే ఏపీలో ఎంట్రీ-బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కామెంట్స్..
ఏపీలో వైఎస్ షర్మిల ఎంట్రీ రాజకీయ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లుగా అన్న వైఎస్ జగన్ తో అంటీముట్టనట్టుగా ఉంటున్న వైఎస్ షర్మిల.. గతేడాది తెలంగాణలో వైఎస్సార్టీపీని స్ధాపించారు. దీంతో తొలిసారి అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలపై చర్చ బహిరంగమైంది.
Recommended Video

అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదా ? అన్న జగన్ తో పోరుకు ఇష్టం లేకపోయినా తప్పడం లేదా ? కడప ఎయిర్ పోర్టులో టీడీపీ నేత బీటెక్ రవితో ఆమె భర్త బ్రదర్ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

చంద్రబాబును కలిసేందుకు అమరావతి వెళ్లేందుకు కడప ఎయిర్ పోర్టుకు వచ్చిన బీటెక్ రవిని.. తాడేపల్లి వెళ్లేందుకు అక్కడికి వచ్చిన వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో మాటామంతీ కలిసింది. మర్యాదపూర్వకంగా పలకరింపులు అయ్యాక.. రాష్ట్ర రాజకీయాలు, ఇతర అంశాలపై ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరికపై చర్చ వచ్చింది. షర్మిలకు పీసీసీ ఛీఫ్ పదవి ఇస్తున్నారా అని బీటెక్ రవి ప్రశ్నిస్తే హైకమాండ్ నిర్ణయిస్తుందంటూ బ్రదర్ అనిల్ చెప్పేశారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కడపలో ఎలా ఉంటుంది అని బ్రదర్ అనిల్ బీటెక్ రవిని ప్రశ్నించారు. దానిపై బీటెక్ రవి తన అభిప్రాయాన్ని బ్రదర్ అనిల్ తో చెప్పారు. అనంతరం కాంగ్రెస్ లో షర్మిల చేరడానికి దారి తీసిన పరిస్దితులపై బ్రదర్ అనిల్ బీటెక్ రవితో అభిప్రాయం పంచుకున్నారు. జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తమకు ఏ ఆప్షన్ లేకుండా చేశారని బ్రదర్ అనిల్ వాపోయారు. దీంతో ఆంధ్రా రాజకీయాల్లోకి రాక తప్పడంలేదన్నారు.
అలాగే తమకు రాష్ట్రంలో 175 సీట్లలో పోటీకి అభ్యర్ధులు రెడీగా ఉన్నారని బ్రదర్ అనిల్ తెలిపారు. మరోవైపు కాంగ్రెస్-టీడీపీ పొత్తు అంటూ జరుగుతున్న చర్చపై స్పందించిన బీటెక్ రవి.. అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. రాష్ట్రంలో, పులివెందులలో కాంగ్రెస్ తో కలిసి పని చేసే ఆలోచన లేదన్నారు. తమ చర్చలు ఇరు పార్టీల పొత్తుకు సంకేతం కాదన్నారు.












Click it and Unblock the Notifications