YS Viveka Case: వైఎస్ అవినాష్ సీబీఐ విచారణలో కీలక మలుపు..!!

కడప ఎంపీ వైఎస్ అవినాష్ విచారణ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. వివేకా హత్య కేసులో ఇప్పటికే సీబీఐ ఆరు సార్లు అవినాష్ ను విచారించింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కానీ, తనకు ముందుకు నిర్ణయించిన కార్యక్రమాలతో హాజరు కాలేనని ఎంపీ చెప్పారు. దీంతో 19న విచారణకు రావాలంటూ మరోసారి సూచించింది. తన తల్లి అనారోగ్యంతో అవినాష్ మరోసారి మినహాయింపు కోరారు. దీంతో, ఇప్పుడు సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ట్విస్టుల మీద ట్విస్టులు : వైఎస్ వివేకా కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు విచారణకు నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి, రెండు సార్లు హాజరు కాలేదు. దీంతో, ఇప్పుడు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్ లోని తమ కార్యాలయంలో విచారణకు రావాలంటూ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ నెలాఖరులోగా సీబీఐ వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది. ఇదే సమయంలో అవినాష్ దాదాపు గత నెల రోజులుగా ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. కర్టులకు వేసవి సెలవులు కావటంతో వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించారు.

avinashredycbi-

మరోసారి నోటీసులు : తెలంగాణ హైకోర్టులో అవినాశ్ బెయిల్ పిటీషన్ పైన విచారణ పూర్తి కాలేదు. వేసవి సెలవుల తరువాత విచారణకు వాయిదా వేసారు. ఇదే సమయంలో తాజాగా అవినాశ్ రెడ్డి న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటీషన్ ను విచారణకు వెకేషన్ బెంచ్ కు ఇవ్వాలని కోరారు. కానీ, విచారణ తేది ఖరారు కాలేదు. ఈ సమయంలోనే తన తల్లి అనారోగ్యం కారణంగా శుక్రవారం విచారణ నుంచి మినహాయింపు కోరారు. దీంతో, ఇప్పుడు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తల్లికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలోనే అవినాశ్ ఉన్నారు. విచారణకు బయల్దేరే సమయంలో తల్లి అనారోగ్యం గురించి తెలియటంతో వెంటనే పులివెందులకు వెళ్లాల్సి వచ్చిందిని..విచారణకు మరో తేది సూచించాలని అవినాశ్ తరపు న్యాయవాదులు సీబీఐని కోరారు.

ఏం జరగనుంది : ఇప్పుడు ఈ నెల 22న విచారణకు రావాలంటూ అవినాశ్ కు సీబీఐ నోటీసులు ఇవ్వటంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది. సోమవారం మరోసారి అవినాశ్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటషన్ విచారణ అంశం మరో సారి ప్రస్తావన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అవినాశ్ కూడా అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. దీంతో, సీబీఐ తాజా నోటీసుల పైన అటు న్యాయపరంగా అవినాశ్ తీసుకొనే నిర్ణయాలు..ఇటు విచారణకు సంబంధించి ఏం చేస్తారు.. విచారణకు వస్తే జరిగే పరిణామాలు ఏంటనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+