వివేకా హత్య కేసులో ట్విస్ట్ : రవి - ఆది ఆ అధికారితో కలిసి కుట్ర : సీబీఐ డైరెక్టర్‌కు శంకర్‌ రెడ్డి లేఖ..!!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ హైదరాబాద్ లో వైసీపీ పులివెందుల నేత దేవిరెడ్డి శంకరరెడ్డిని అరెస్ట్ చేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ కోసం ఈరోజు తెల్లవారుజాము సికింద్రాబాద్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో శివశంకర్ రెడ్డిని కడపకు తరలించారు.

వశంకర్ రెడ్డిని ఈరోజు పులివెందుల కోర్టులో సీబీఐ హాజరుపర్చనుంది. ఇదే సమయంలో సీబీఐ డైరెక్టర్‌కు శంకర్‌ రెడ్డి లేఖ రాసారు. వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేసారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీడియాలో చర్చలు నడుస్తున్నాయని..ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదు.. తాను నిర్దోషి అని పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు

ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు

తనను ఉద్దేశ పూర్వకంగా ఈకేసులో ఇరికిస్తున్నారని వివరించారు. వివేకానందరెడ్డి మరణం విషయం తనకు తెల్లవారుజామన వివేకానందరెడ్డి బావమరిది ద్వారా తెలిసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన సిట్‌.. పలుమార్లు తనను విచారించిందని.. 2019 మార్చి నెలలో వారంరోజులపాటు తన పై విచారణచేశారని చెప్పారు. విచారణ సమయంలో నన్ను తీవ్రంగా హింసించారన్నారు.

ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత మరో మూడు సార్లు కూడా తనపై విచారణ చేశారన్నారు. ప్రతిసారి తాను విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నానని..తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పానని వివరించారు. సునీత దర్యాప్తు అధికారులను కలుస్తూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ దురుద్దేశాలను ఆపాదిస్తూ పిటిషన్లు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు.

సునీత అమాయకులపై నిందలు

సునీత అమాయకులపై నిందలు

ఆమె ఇష్టాయిష్టాల ప్రకారం.. అమాయకులైన వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ, నిందలు మోపారని వివరించారు. కారణాలేంటో తెలియదుగాని సునీత వ్యవహారం భిన్నంగా ఉందన్నారు. వివేకా భౌతిక కాయం దగ్గర దొరికిన లేఖ వ్యవహారంలో వైయస్‌.సునీత, ఆమె భర్త ఎన్‌.రాజశేఖర్‌రెడ్డితో పాటు, ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి వ్యవహారశైలి అసహజంగా ఉందని వివరించారు. చాలా అనుమానాలను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. వివేకా ఫోన్‌లోని డేటాను, సమాచారాన్ని వారు టాంపర్‌చేసి, డిలీట్‌ చేసిన తర్వాత దర్యాప్తు సంస్థలకు ఇచ్చారా.. లేదా అనే అంశాన్ని తేల్చాలని కోరారు. ఎర్రగంగిరెడ్డి ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు.. ఎవరు చెప్తే ఆయన అక్కడకు వచ్చారు.. ఆయనతో టచ్‌లో ఉన్న వివేకా కుటుంబ సభ్యులు ఎవరనేది తేల్చాలని కోరారు.

దస్తగిరికి బెయిల్ ఎలా వచ్చింది

దస్తగిరికి బెయిల్ ఎలా వచ్చింది

ఇంటరాగేషన్‌ లేకుండా దస్తగిరికి కేవలం ఐదురోజుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు అయ్యింది. సునీత భర్తే లాయర్‌ను పెట్టి ఆయనకు బెయిల్‌ ఇప్పించాడు. తన తండ్రిని చంపిన వ్యక్తికి సునీత, ఆమె భర్త ఎందుకు సహాయపడుతున్నారని అనుమానం వ్యక్తం చేసారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వివేకా హత్య జరిగింది.

40 ఏళ్లుగా వైయస్సార్‌ కుటుంబానికి పులివెందుల పెట్టనికోటలా ఉంది. వివేకాను తొలగించుకోవడం ద్వారా పార్టీని పెంచుకోవాలనే ఆలోచన చేసి ఉండరా.. ఈప్రశ్నకు దర్యాప్తు ద్వారా సమాధానం రాబట్టాలన్నారు. వివేకా హత్యకు కొన్ని వారాల ముందు బిటెక్‌.రవి, ఆదినారాయణరెడ్డి ఇతరులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తర్వాత వారు విజయవాడలో ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. అక్కడే కుట్రపన్నారని పేర్కొన్నారు.

బిటెక్ రవి..ఆదినారాయణ రెడ్డి పైన అనుమానాలు

బిటెక్ రవి..ఆదినారాయణ రెడ్డి పైన అనుమానాలు

బిటెక్‌.రవి, ఆదినారాయణరెడ్డి, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబి వెంకటేశ్వర్రావుతో సమావేశమయ్యారు. మొత్తం కుట్ర అక్కడే జరిగిందని వివరించారు. పరమేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా జాయిన్‌ అయ్యారు. తర్వాత ఆస్పత్రిలో ఎవరికీ చెప్పకుండా వచ్చేశారు. ఆతర్వాత బీటెక్‌ రవితో సమావేశమయ్యాడు. వివేకా హత్యకు ముందురోజు మార్చి, 14, 2019న కడప హరిత హోటల్‌లో వీరిద్దరూ మాట్లాడుకున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలి. తర్వాత చంద్రబాబు, వివేకా హత్యను తన రాజీకీయ ప్రచారంగా వాడుకున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఘటన గురించే ప్రచారం చేశారు. వివేకా హత్య.. టీడీపీకి అడ్వాంటేజ్‌. ఈ కోణంలో సీబీఐ విచారణచేయాలి.

హత్య వెనుక వారి పాత్రను ఆరా తీయండి

హత్య వెనుక వారి పాత్రను ఆరా తీయండి

2016 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిపై బీటెక్‌ రవి గెలుపొందారు. వివేకానందరెడ్డి వల్ల బీటెక్‌ రవి రాజకీయ జీవితానికి అడ్డుపడే అవకాశాలున్నాయి. ఈ కోణంలోకూడా విచారణ చేయాలి. వివేకా హత్య వెనుక చంద్రబాబు, ఏబి. వెంటకేశ్వర్రావు, బి.టెక్‌.రవి, ఆదినారాయణరెడ్డిల కుట్ర కోణంపై విచారణచేయాలని లేఖలో శంకర్ రెడ్డి కోరారు. ఇదే సమయంలో.. హైదరాబాద్‌ మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు సీబీఐకి లేఖ రాశారు. వివేకా హత్యకేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మూడు రోజుల కిందటే తన తండ్రికి భుజానికి ఆపరేషన్‌ జరిగిందని..ఆయనకు భుజానికి ఇంకా నొప్పి ఉంది. ఆయన పనులు ఆయన చేసుకోలేక పోతున్నారని వివరించారు. తమకు న్యాయం చేయాలని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు లేఖలో కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+