జగన్‌కు షాక్: కెసిఆర్‌తో భేటీ, తెరాసలోకి ఎమ్మెల్యే

 YSR Congress MLA may join in TRS
హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ తప్పేట్లు లేదు. జిల్లా నుంచి మరో ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరేందుకు సిద్ధమయ్యా రు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు కారెక్కేందుకు సిద్ధమయ్టారు.

జిల్లా నుంచి వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ సైతం తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలోనే మంగళవారం మదన్‌లాల్‌ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన నివాసంలో కలిపి పార్టీలో చేరేందుకు తన సుముఖతను వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజుల్లో పార్టీలో చేరేందుకు అన్ని ర కాల ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. దీనికి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి నట్లు తెలుస్తోంది.

నేడో రేపో మదన్ లాల్ తెరాసలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కూడా తెరాసలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లాలో బలం పుంజుకునేందుకు తెరాస నేతలు వివిధ పార్టీల నాయకులకు గాలం వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+