ఇదీ జగన్ మాట: ప్రశాంత్ కిషోర్ తాజా వ్యూహం, రివర్స్ అవుతోందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైసిపి దెబ్బతిన్నది.

బాబు ఆలోచించారు నాదే తప్పు, ముందే తెలుసుకున్నా: జగన్‌పై జూపూడి

వైయస్సార్ కుటుంబంపై ప్రచారం

వైయస్సార్ కుటుంబంపై ప్రచారం

ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వైయస్సార్ కుటుంబం అంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఇది జగన్ మాటగా..

ఇది జగన్ మాటగా..

వైయస్సార్ కుటుంబం అంటూ చేస్తున్న ప్రచారంపై కొంత విమర్శలు వస్తున్నాయి. 'రండి, వైయస్సార్ కుటుంబంలో భాగమయ్యి, మీ సమస్యలను మాతో పంచుకోండి. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ సమస్యల పరిష్కారణకు ప్రాధాన్యత ఇస్తానని నేను భరోసా ఇస్తున్నాను.' అని జగన్ చెప్పినట్లుగా ఉంది.

ఇలా చెప్పడంపై విడ్డూరమంటూ..

ఇలా చెప్పడంపై విడ్డూరమంటూ..

అయితే, ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్ సమస్యలను తన వద్దకు తీసుకు వస్తే మన ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తానని చెప్పడం ఏమిటని అంటున్నారు. ప్రతిపక్ష నేతగా సమస్యలు తన వద్దకు వచ్చినప్పుడు అధికార పార్టీని ప్రశ్నించాల్సి ఉంటుంది. కానీ, వైయస్ కుటుంబంలో చేరాలని, తమ వద్దకు సమస్యలు వస్తే వాటిని వైసిపి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించే ప్రయత్నం చేస్తానని చెప్పడం విడ్డూరమని అంటున్నారు.

ప్రశాంత్ కిషోర్ వ్యూహం

ప్రశాంత్ కిషోర్ వ్యూహం

అక్టోబర్ 27వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అంతకుముందే దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్రశాంత్ కిషోర్ భావించారు.

పీకే వ్యూహం రివర్స్ అవుతోందా?

పీకే వ్యూహం రివర్స్ అవుతోందా?

కానీ ప్రచారం కోసం చెబుతున్న దాంట్లో కొందరు తప్పులు వెతకడం వైసిపికి రివర్స్ అవుతోందని అంటున్నారు. సమస్యలను మేం అధికారంలోకి వచ్చాక పరిష్కారం చేస్తామని చెప్పడం ఏమిటని అంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీని నిలదీయాల్సింది అలా చెప్పడం ఏమిటంటున్నారు. వైయస్సార్ కుటుంబం ప్రశాంత్ కిషోర్ వ్యూహంగా చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YS Jagan is in a deep shock after Nandyal, Kakinada result. Apparently, Jagan is unable to digest the victory of TDP rather than YSRCP's defeat.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి