వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో నేతల భావోద్వేగం..

అమరావతి: నేడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రికి నివాళి అర్పించారు. వైఎస్సార్ లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని చెప్పారు. భౌతికంగా తమ మధ్య లేకపోయినా.. ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే నేతగా అభివర్ణించారు.

వైఎస్సార్ పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు తనకు కొండంత అండగా నిలిచాయంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. తండ్రి ఆశయాలే.. సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో తనను చేయి పట్టి నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా జరుపుకొంటోంది.

YSR Vardhanthi: Sajjala Ramakrishna Reddy pays tributes to late CM YS Raja Sekhar Reddy

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పిస్తోన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. పేదలకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలను నిర్వహించారు. అనేకచోట్ల పేదలకు దుస్తులను పంచిపెట్టారు. పలు సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి నివాళి అర్పించారు. అనంత‌రం ర‌క్త‌దాన శిబిరాన్ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్రారంభించారు. అలాగే పేద‌ల‌కు దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. ఒక వ్యక్తి చిత్తశుద్ధితో సాగించిన పరిపాలన అనేది ప్రజల జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందనడానికి వైఎస్సార్ ఓ ఉదాహరణ అని అన్నారు. కోట్లాది ప్రజల గుండెల్లో ఆయన చిర స్థానం సాధించారని చెప్పారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపారని గుర్తుచేశారు.

YSR Vardhanthi: Sajjala Ramakrishna Reddy pays tributes to late CM YS Raja Sekhar Reddy

వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం అలముకున్న చీకటిలో వైఎస్ జగన్ ఓ వెలుగు రేఖలా వచ్చారని సజ్జల అన్నారు. మాట మీద నిలబడే తత్వమే ప్రజల్లో ఆయన అంటే ఒక నమ్మకాన్ని సృష్టించిందని, ఆయనకు నిజమైన రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ నాలుగేళ్లుగా పాలన చేస్తోన్నారని పేర్కొన్నారు.

మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ కన్నుమూసి ఇన్ని సంవత్సరాలయినప్పటికీ.. ఆయన ఇప్పటికీ మనమధ్య సజీవంగా ఉన్నట్టే కనిపిస్తోందని చెప్పారు. ఏ పేదవాడి గుండెను తాకినా వైఎస్సార్ అనే భావోద్వేగం పొంగుకొస్తుందని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని మానవతా వాది అభివర్ణించారు. వైఎస్సార్ ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన బాటలో వైఎస్‌ జగన్ నాలుగు అడుగులు వేస్తోన్నారని జోగి రమేష్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+