రోజా సస్సెన్షన్‌ ఎత్తివేతకు యనమల నో: సమావేశాలను బహిష్కరించిన వైసీపీ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా తొలుత ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్ అంశాన్ని ప్రస్తావించారు. తమ పార్టీ సభ్యురాలిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

దీంతో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై విధించిన ఏడాది సస్పెన్షన్‌పై అధికార, విపక్షాల వాడీ వేడీ చర్చ జరిగింది. రోజాపై సస్పెన్షన్ ఎత్తేయకుంటే తాము సభలో ఉండలేమని ప్రతిపక్ష జగన్ పేర్కొన్నారు. తమ సభ్యురాలిపై తీసుకున్న సస్పెన్షన్ అంశాన్ని మరోసారి పునరాలోచించకుంటే ఈ సమావేశాలను బాయ్ కాట్ చేసేందుకూ వెనుకాడబోమని ఆయన ప్రకటించారు.

YSRCP Boycotts Assembly Winter Session

దీనిపై స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నిబంధనల మేరకే రోజాపై సస్సెన్షన్ వేటు వేశామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గేది లేదని కూడా ఆయన తేల్చిచెప్పారు. రోజా సస్పెన్షన్‌పై అవసరం అయితే, కోర్టుకు కూడా వెళతామని ఆయన అన్నారు.

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడిన మాటలు కూడా 'కాల్ మనీ, సెక్స్ రాకెట్' తీవ్రత తగ్గించేలా ఉన్నాయని వైఎస్ జగన్ ఆక్షేపించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, కాల్ మనీ వ్యవహారంపై చర్చ జరగేందుకు స్పీకర్ కోడెల అంగీకరించ పోడవంతో వైసీసీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+