జగన్ పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తుగా సీలింగ్ ఫ్యాన్

2011 మార్చి 12న ఆవిర్భవించిన వైయస్సార్ కాంగ్రెసు ఆ తర్వాత అదే గుర్తుపై రాష్ట్రంలో పలు ఉప ఎన్నికలను ఎదుర్కొంది. 2011 మే నెలలో కడప లోకసభ, పులివెందుల శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైయస్ జగన్, వైయస్ విజయమ్మ సీలింగ్ ఫ్యాన్ గుర్తుతోనే విజయం సాధించారు.
తర్వాత 2012 మార్చిలోను, జూన్‌లోను జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరులోకసభతో పాటు 16 అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు సీలింగ్ ఫ్యాన్ గుర్తు పైనే పోటీ చేసి గెలుపొందారు. తర్వాత పార్టీ ప్రమేయం లేని స్థానిక సంస్థల ఎన్నికల్లోను ఆశించిన విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో వచ్చే లోకసభ, శాసన సభ సాధారణ ఎన్నికల్లో కామన్ సింబల్‌గా సీలింగ్ ఫ్యాన్ గుర్తునే కేటాయించాలని కోరూతూ డిసెంబర్ 1న, 3న పార్టీ సిఈసి సభ్యులు ఈసికి వేర్వేరుగా లేఖలు రాశారు. దీంతో ఈ గుర్తును కేటాయించారు.












Click it and Unblock the Notifications