మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్..!!

ఏపీ ఎన్నికల ఫలితాలు పలు అంశాలపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 12న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓటమి కంటే వచ్చిన సీట్లు వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఎక్కడ పొరపాటు జరిగిందని పోస్టుమార్టం చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ హాయంలో వివాదాస్పదంగా మారిన మూడు రాజధానుల నిర్ణయం పైన వైసీపీ స్వరంలో మార్పు కనిపిస్తోంది. దీని పై మాజీ మంత్రి అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

రాజధాని పై రిఫరెండం
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019లో మూడు రాజదానుల అంశం తెర మీదకు తెచ్చింది. దీని పైన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంలో పెండింగ్ లో ఉంది. ఇక జగన్ తాను గెలిస్తే తన ప్రమాణ స్వీకారం విశాఖలోనే ఉంటుందని గతంలో స్పష్టం చేసారు. అయితే...ఎన్నికల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. ఎన్డీఏలోని మూడు పార్టీలు అమరావతికి మద్దతుగా నిలిచాయి. అమరావతిని కొనసాగిస్తామని హామీ ఇచ్చాయి.

YSRCP leader Amarnath key comments over Public mandate on Three capital proposal

ఎన్నికల తీర్పుతో
ఎన్నికల్లో అమరావతి తో పాటుగా విశాఖ సహా ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీని తిరస్కరించారు. మూడు జిల్లాల్లోనూ అక్కడ కేవలం రెండు స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కాయి. ఇటు అమరావతి ప్రాంతంలో వైసీపీ అడ్రస్ గల్లంతు అయింది. దీంతో..రెండు ప్రాంతాల్లోనూ వైసీపీ నిర్ణయాలను ప్రజలు తిరస్కరించినట్లు స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ రాజధాని పై తాజాగా వచ్చిన ఫలితాలు రిఫరెండమేనని అంగీకరించారు. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలిని పేర్కొన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చిన ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

వైసీపీ ఆలోచన మార్పు
వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదని అమర్నాధ్ అభిప్రాయపడ్డారు. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా ప్రభుత్వం - పార్టీ మధ్య దూరం పెరిగిందని విశ్లేషించారు. సుపరిపాలన అందించినా ఎందుకు గెలవలేక పోయామో సమాధానం వెతుకోవాల్సి ఉందన్నారు. వైజాగ్‌లో మేము నిర్మించిన వ్యూ పాయింట్ తీసేయాలి అనుకుంటే.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామని.. అది కూడా తీసేయాలని వ్యాఖ్యానించారు. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అనే మా అధినాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుందని అమర్నాధ్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+