ఎవర్ని తొక్కిపెట్టి నార తీస్తావ్ పవన్ ? ప్రజలే తీస్తారు.. బొత్స కౌంటర్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలోని పలు చోట్ల చేస్తున్న పర్యటనలు, అక్కడ చోటు చేసుకుంటున్న ఘటనల్ని ప్రస్తావిస్తూ తాజాగా కూటమి ఏడాది పాలన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. వీటికి ఇవాళ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఉల్లంఘించాలని చూస్తే తొక్కిపెట్టి నార తీస్తానంటూ జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ తాజాగా కూటమి సభలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై ఫిర్యాదు చేసేందుకు విజయవాడలోని రాజ్ భవన్ కు బొత్స ఇతర వైసీపీ నేతలతో కలిసి వచ్చారు. గవర్నర్ కు ప్రభుత్వంపై ఫిర్యాదు చేసి బయటికి వచ్చాక ఆయన పవన్ కళ్యాణ్ కామెంట్స్ పైనా ఫైర్ అయ్యారు.

ysrcp leader botsa Satyanarayana strong counter to pawan kalyan s remarks on ys jagan

తొక్కిపెట్టి ఎవరి నార తీస్తారు, ఎవరి మక్కెలు విరగొడతారు పవన్ కళ్యాణ్ చెప్పాలని బొత్స కోరారు. ప్రజలే అందరి నార తీస్తారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పారని బొత్స గుర్తుచేశారు. జగన్ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అని మర్చిపోవద్దన్నారు. బాధ్యతా రహితంగా మాటలాడటం మానుకోవాలన్నారు. చట్టాన్ని అందరూ గౌరవించాలన్నారు.

మరోవైపు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలపై ఫిర్యాదు చేసినట్లు బొత్స తెలిపారు. జగన్ పై తప్పుడు కేసులు గురించి వివరించామన్నారు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడు చూడలేదన్నారు. సత్తెనపల్లి ఘటనలో ఎస్పీ మొదటి రోజు జగన్ కారుకి అక్కడ జరిగిన సంఘటనకు సంబంధం లేదని చెప్పారని, తరువాత ప్రభుత్వం ఒత్తిడితో మాట మార్చారన్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టాలనుకోవడం అరచేతితో సూర్యుడిని ఆపాలనుకోవటమే అన్నారు.

ysrcp leader botsa Satyanarayana strong counter to pawan kalyan s remarks on ys jagan

జగన్ కి నిజంగా సెక్యూరిటీ ఇస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవలసింది వారేనన్నారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు ఆలోచనలను మానుకోవాలన్నారు. వైసీపీ ప్రజల తరపున ప్రశ్నించే పార్టీ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రభుత్వం మెడలు వంచుతామని బొత్స హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+