అచ్చెన్నాయుడిపై వైసీపీ అభ్యర్థి ఖరార్: ఊహించని విధంగా..!!
శ్రీకాకుళం: వచ్చే సార్వత్రిక ఎన్నికలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు పార్టీ పరంగానూ కీలక నిర్ణయాలను తీసుకుంటోన్నారు. అభ్యర్ధుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే విషయంలో రాజీపడట్లేదు.
క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకున్న తరువాతే అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వస్తోన్నారు వైఎస్ జగన్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా ప్రజల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ను ప్రాతిపదికగా తీసుకుంటోన్నారు. ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేయడానికి, పరిపాలన- సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయాలను సేకరించడానికి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆధారంగా తీసుకుంటోన్నారు.

ఈ క్రమంలో- 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ధీటైన అభ్యర్థులను ఎంపిక చేస్తోన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇప్పటికే ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తాజాగా మరో కీలక నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేశారు.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దువ్వాడ వాణిని ఎన్నికల బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది. ఆమె- వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ భార్య. గతంలో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్‌గా పని చేశారు. టెక్కలి టికెట్‌ను దాదాపుగా ఆమెకే దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం.. టెక్కలి. ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 2019 వరకు ఏడు సార్లు ఆ పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్‌పై అచ్చెన్నాయుడు ఘన విజయం సాధించారు.
2024లో జరగబోయే ఎన్నికల్లో అచ్చెన్నాయుడి జైత్రయాత్రకు చెక్ పెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా ఆయనపై మహిళా అభ్యర్థిని బరిలో దింపబోతోన్నారు. దువ్వాడ వాణికి టికెట్ కేటాయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పేరాడ తిలక్ సేవలను పార్టీపరంగా వినియోగించుకోవాలని భావిస్తోన్నారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు












Click it and Unblock the Notifications