ముద్రగడకు కీలక బాధ్యతలు

YS Jagan Mohan Reddy: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం క్రమంగా కోలుకుంటోంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరి వంటి కీలక నియోజకవర్గాలకు కొత్త ఇన్‌ఛార్జీలను నియమించింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కాన్సెప్ట్‌ను తెర మీదికి తీసుకొచ్చిన నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు జరగొచ్చంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోంది.

YSRCP leader Mudragada Giri has been appointed as Coordinator for Prathipadu Assembly

ఈ పరిస్థితుల్లో ఇప్పటినుంచే పార్టీని బలోపేతం చేయడంపై వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలో రీజినల్ కోఆర్డినేటర్లను అపాయింట్ చేశారు. పార్టీ సీనియర్ నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు. భారీగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు ఈ హోదాలో పని చేసిన వాళ్లలో కొందరిని కొనసాగించినప్పటికీ- వాళ్లు పర్యవేక్షించిన ప్రాంతాలు మారాయి.

కీలకమైన ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎంపీ విజయసాయి రెడ్డి నియమితడైన విషయం తెలిసిందే. వైవీ సుబ్బారెడ్డికి ఉమ్మడి చిత్తూరు, గుంటూరు జిల్లాల సమన్వయ బాధ్యతలు దక్కాయి. ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అపాయింట్ అయ్యారు.

మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉమ్మడి కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌‌ బాధ్యతలు లభించాయి. ఈ రెండు ఉమ్మడి జిల్లాలు కూడా వైఎస్ఆర్సీపీ కంచుకోటగా ఉంటూ వచ్చాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది.

వైసీపీలో ఈ మార్పులు చేర్పులు కొనసాగుతోన్నాయి. తాజాగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్‌గా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి నియమితులయ్యారు. ఈ మేర‌కు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

మొన్నటి ఎన్నికల్లో ప్రత్తిపాడులో ఓటమి చవి చూసింది వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వరుపుల సుబ్బారావు తన సమీప ప్రత్యర్థి, టీడీపీకి చెందిన వరుపుల సత్యప్రభ చేతిలో 38 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. టీడీపీకి కంచుకోట ఈ నియోజకవర్గం. ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఆరుసార్లు పసుపు జెండా ఎగిరింది. వైసీపీ రెండుసార్లు ఇక్కడ గెలవగలిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+