వైసీపీకి కీలక నేత గుడ్ బై, జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలను అమల్లోకి తెస్తున్నారు. కూటమికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల పైన మాజీ సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కొత్తగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. కాగా, ఇదే సమయంలో జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ముఖ్య నేతలు పార్టీ వీడటం రాజకీయంగా ఆసక్తి కర పరిణామంగా మారుతోంది.

మాజీ సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో ఇబ్బంది పడుతున్న వారికి మద్దతుగా నిలుస్తున్నారు. పరామర్శలు.. సమావేశాలతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నారు. ఇదే సమయంలో కీలక నియోజకవర్గాలకు ఇంఛార్జ్ లను నియమిస్తున్నారు. తాజాగా గూడూరు, తరువాత ఉండి నియోజకవర్గానికి కొత్త సమన్వయ కర్తను నియమించారు. ఇప్పుడు ఆ నిర్ణయమే కీలక నేత రాజీనామాకు సిద్దమైంది. వైసీపీ ఆవిర్భావం తరువాత ఇప్పటి వరకు ఉండిలో వైసీపీ విజయం సాధించలేదు. మూడు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. వరుసగా 2019, 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసిన పీవీఎల్ నరిసంహ రాజు పరాజయం చెందారు. దీంతో.. ఇప్పుడు జగన్ నియోజకవర్గంలో కొత్త నేతకు బాధ్యతలు అప్పగించారు. అక్కడ ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు.

ysrcp-leader-pvl-narasimha-raju-resigned-for-party-against-ys-jagan-latest-decision-in-undi

ఉండి కేంద్రంగా కీలక పరిణామాలు

ఉండి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా తాజాగా యోగేంద్ర బాబును నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఇంఛార్జ్ గా ఉన్న నరసింహ రాజుకు పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ నిర్ణయంతో నరసింహరాజు విభేదించారు. పార్టీకి.. పదవికి రాజీనామా చేసారు. వైసీపీ ఉండి నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఆయన తొమ్మిదేళ్లు పని చేసారు. పార్టీ లో కష్టపడి పని చేసిన వారికి విలువ లేదని.. గౌరవం లేని చోట ఉండలేనని చెప్పారు. తాను జగన్ ను కలిసి ఇన్‌చార్జిగా ఎవరికైనా ఇవ్వండి..అభ్యంతరం లేదు.. కానీ యోగేంద్రబాబుకు ఇస్తే చేయలేనని చెప్పినట్లు వెల్లడించారు. అయితే, ఇప్పుడు యోగేంద్ర బాబునే జగన్ ఇంఛార్జ్ గా నియమించటంతో తన మాటకు విలువ లేదని అర్దమైందని చెప్పుకొచ్చారు. దీంతో, తాను పార్టీకి దూరం కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+