బీజేపీలో ఎమ్మెల్యే సీట్ల ఖరారు వెనుక - సజ్జల కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. పొత్తుల్లో బీజేపీకి 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు దక్కాయి. ఎమ్మెల్యే సీట్లకు సంబందించి అభ్యర్దులను బీజేపీ ప్రకటించింది. అందులో సీట్లు దక్కించుకున్న వారి పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. వైసీపీ కుట్ర ఉందని సీట్లు దక్కని నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీలోని పలువురు సీనియర్లకు సీట్లు దక్కలేదు. ఈ విషయం పైన వైసీపీ ముఖ్య నేత సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు.
ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదు. ప్యాంట్రీ కారుపై కూడా అసత్య ప్రచారం చేశారు. అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంటీ కారుపై తప్పుడు ప్రచారం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదు. బీజేపీలో ఉన్న టీడీపీ ఏజెంట్లకే టికెట్లు ఇచ్చారని విమర్శించారు. వారంతా టీడీపీకి కావాల్సిన వారనేని చెప్పుకొచ్చారు.

సిద్దం బస్సు యాత్రకు జనం నుంచి మంచి స్పందన వస్తుందని సజ్జల వివరించారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. చంద్రబాబు ప్రచార సభలను ఎవరూ పట్టించుకోవటం లేదని కనీస స్పందన లేదని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు మోసపూరిత హామీలతో వస్తున్నారన్నారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేదని పేర్కొన్నారు.
వైసీపీకి స్పష్టమైన అజెండా ఉందని.. ప్రజలకు ఏం చేస్తామో చెప్తూ జగన్ ప్రచారం సాగుతుందని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు దోచుకున్నారని సజ్జల ఆరోపించారు. జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ఫ్యాన్ట్రీకి ఈసీ అనుమతి తీసుకున్నామని వెల్లడించారు. శ్రీకాకుళంలో చట్టబద్ధంగా తీసుకున్న గోడౌన్ పై కూడా టిడిపి తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పాల్సిన టిడిపి తప్పుడు ప్రచారం చేయడం పైనే నమ్మకం పెట్టుకొని ఎన్నికలకు వచ్చిందని సజ్జల విమర్శించారు.












Click it and Unblock the Notifications