గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోరిక తీరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు: వైసీపీ నేతపై మహిళ సంచలన ఆరోపణ

లైంగిక వేధింపుల కేసులో వైసీపీ నాయకుడు కృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: లైంగిక వేధింపుల కేసులో వైసీపీ నాయకుడు కృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

బోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారుబోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారు

కృష్ణారెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, అప్పిరెడ్డి తదితరులు కోర్టు వద్దకు వచ్చారు.

 ఉద్యోగం కోసం వస్తే

ఉద్యోగం కోసం వస్తే

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ సమయంలో మాచవరానికి చెందిన శోభ అనే మహిళ అంగన్వాడీ ఉద్యోగం కోసం ఆశ్రయించారు. ఇందుకు కృష్ణా రెడ్డి రూ.50వేలు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

ఆయన చుట్టూ తిరిగింది

ఆయన చుట్టూ తిరిగింది

అనంతరం ఉద్యోగం కోసం ఆమె ఆయన చుట్టూ తిరిగింది. ఉద్యోగం ఇప్పించలేదు. పైగా లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. తాజాగా ఆ బాధితురాలు వారం క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 కేసు నమోదు

కేసు నమోదు

పోలీసులు కృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. లైంగిక వేధింపుల సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. మంగళవారం ఆయనను అదుపులోకి తీసుకొని, గుంటూరు ఏదో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు.

 కోరిక తీరిస్తే ఉద్యోగం అన్నాడని

కోరిక తీరిస్తే ఉద్యోగం అన్నాడని

ఇదిలా ఉండగా, ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆరోపణలు చేసారు. 2012లో అంగన్వాడీ ఉద్యోగం కోసం కృష్ణారెడ్డి వద్దకు వెళ్లానని, కోరిక తీర్చితే కొలువు ఇప్పిస్తానని చెప్పాడని ఆమె కంటతడి పెట్టారని పేర్కొన్నారు.

English summary
YSR Congress Party leader in sexual assult case in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X