Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్ - కొత్త ఇంఛార్జ్ ల నియామకం..!!

వైసీపీలో అభ్యర్దుల పైన సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి విడతలో 11 మందిని మార్చిన పార్టీ నాయకత్వం రెండో జాబితా సిద్దం చేసింది. తూర్పు గోదవరి జిల్లాలో మూడు నియోకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఒక స్థానం ప్రస్తుత ఎంపీకి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటుగా మరో 15 స్థానాల వరకు మార్పులు - చేర్పులు ఖాయమని తెలుస్తోంది.

ఇంఛార్జ్ ల మార్పు
వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జ్ ల మార్పులు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరిలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చటం ఖాయమని తెలుస్తోంది. వారితో పార్టీ నాయకత్వం చర్చలు చేస్తోంది. వారికి ప్రత్యామ్నాయ అవకాశాల పైన సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పిఠాపరం ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగా గీతకు నియోజకవర్గ ఇంఛార్జ్ గా బాధ్యతలు కేటాయింపు ఖాయమైంది. దీనికి సంబంధించి గీతకు క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. 2009లో ప్రజారాజ్యం నుంచి వంగాగీత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి వర్మ, జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఇక్కడ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు.

YSRCP likely to Appoint new incharges for Three Constituencie in East Godavari Dist

ఎమ్మెల్యేగా గీత..ఎంపీగా కన్నబాబు
కాకినాడ ఎంపీ స్థానం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జగ్గంపేట ఎమ్మెల్యేను మార్చటం ఖాయంగా కనిపిస్తోంది. అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ స్థానంలో మాజీ ఎంపీ...సీనియర్ నేత తోట నర్సింహం పేరు ఖరారు చేసారు. తోట నర్సింహం 2014లో కాకినాడ ఎంపీగా టీడీపీ నుంచి గెలిచి పార్టీ లోక్ సభలో ఫ్లోర్ లీడర గా పని చేసారు. 2004, 2009 లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2019లో వైసీపీలో చేరి ఆయన సతీమణి తోట వాణి పెద్దాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు తిరిగి జగ్గంపేట నుంచి తోట నరసింహం కు సర్వే నివేదికలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. జ్యోతుల చంటిబాబుతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

YSRCP likely to Appoint new incharges for Three Constituencie in East Godavari Dist

మార్పులు -చేర్పులు
అదే విధంగా ప్రత్తిపాడు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే పర్వతనేని పూర్ణచంద్రప్రసాద్ స్థానంలో పర్వతనేని జానకీ దేవి ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2019లో టీడీపీ నుంచి వరుపుల రాజా పోటీ చేసారు. ఆ తరువాత ఆయన మరణించారు. ఆయన సతీమణికి టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సీటు విషయంలో వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవటంతో నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన మార్పుల పైన పార్టీ అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+