వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో ఏం పీకుదామని.. చించేస్తామని చెప్పి ఇలానా, దిక్కుమాలిన సీఎం: బాబుపై అనిల్ యాదవ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తమ ఎంపీలు పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌​యాదవ్‌.హోదాపై ముందు నుంచి తమ అధినేత జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నారని స్పష్టం చేశారు.

నేడే క్లైమాక్స్?: 'అవిశ్వాసం' చర్చకు వస్తుందా!, ఉధృతం కానున్న హోదా పోరు.. నేడే క్లైమాక్స్?: 'అవిశ్వాసం' చర్చకు వస్తుందా!, ఉధృతం కానున్న హోదా పోరు..

చెప్పినట్టుగానే హోదా కోసం పోరాడుతున్నామని, 12సార్లు అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌కు అందజేశామని గుర్తుచేశారు. సభకు అన్నాడీఎంకె అడ్డు తగులుతుంటే.. చంద్రబాబు కనీసం వారితో మాట్లాడి సానుకూల స్పందన తీసుకురాలేకపోయాడని విమర్శించారు.

ఏం పీకుదామని ఢిల్లీ వెళ్లారు?

ఏం పీకుదామని ఢిల్లీ వెళ్లారు?

తమిళనాడు సీఎంతో మాట్లాడి ఒక్కరోజైనా చర్చ జరిగేలా సహకరించాలని కోరని దిక్కుమాలిన సీఎం చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పక్క రాష్ట్ర సీఎంతోనే మాట్లాడలేని చంద్రబాబు.. ఢిల్లీ వచ్చి ఏం పీకుదామనుకున్నారు? అని ప్రశ్నించారు.

ఢిల్లీ వచ్చి ఏదో చించేస్తానని, కేంద్రానికి దడ పుట్టిస్తానని చెప్పి.. చివరకు ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని పార్లమెంటు వద్ద తగ్గించారని అన్నారు. ఫోటోల పోజుల కోసం పార్లమెంటు మెట్ల ముందు వంగడం సిగ్గుచేటన్నారు. హేమాహేమిలను కలుస్తానని చెప్పి.. హేమమాలిని కలిశారని ఎద్దేవా చేశారు.

 బాబు.. మహమ్మద్ గజిని

బాబు.. మహమ్మద్ గజిని

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని చెప్పారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా లడ్డులు ఇచ్చి, శాలువాలు కప్పి వచ్చారని, ఇప్పుడేమో హోదా కోసం తానే పోరాడుతున్నట్టు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు మహ్మద్‌ గజినీలా చూస్తున్నారని, ఆయనేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని అన్నారు.

దిక్కుమాలిన డ్రామాలు వద్దు

దిక్కుమాలిన డ్రామాలు వద్దు

ఇప్పటికైనా దిక్కుమాలిన డ్రామాలు ఆపి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పోరాడాలని అన్నారు. తమ ఎంపీల రాజీనామాలను ఆమోదింపచేసుకుని ఉపఎన్నికలకు వెళ్లి గెలిచి తీరుతామని అనిల్ యాదవ్ స్పష్టం చేశారు. టీడీపీ సైకిల్‌ యాత్రలు ఒక డ్రామా అని కొట్టిపారేశారు.

లాలూచీ పడ్డారు: పెద్దిరెడ్డి

లాలూచీ పడ్డారు: పెద్దిరెడ్డి

సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డారని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌, టీడీపీ ఎంపీలు కలిసి పార్లమెంటులో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసునని అన్నారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాుడతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్దపడ్డారని చెప్పారు. రాజీనామాల అనంతరం ఎంపీలు ఆమరణ దీక్షకు దిగుతారని చెప్పారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఆమరణదీక్షకు రావాలని డిమాండ్ చేశారు.

English summary
YSRCP MLA Anil Kumar Yadav fired on AP CM Chandrababu Naidu. He alleged CM still playing dramas for his political gains
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X