స్పీకర్ మైక్ లాగిన ఎమ్మెల్యే, జగన్‌ది రాక్షసత్వమని..
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడు మణిగాంధీ స్పీకర్ పోడియం వద్ద గల మైక్ లాగారు. దీంతో సభలో దుమారం రేగింది. సభాపతి మైక్ లాగిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యుడి పైన చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
నియంతృత్వ ధోరణి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిది నియంతృత్వ ధోరణి అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి సభ విపక్షాల జాగీరు కాదన్నరు. ప్రతిపక్ష నేత అక్రమాలు వెలుగులోకి వస్తాయనే ఆందోళనతోనే సభను జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

గంటన్నర మాత్రమే ఇచ్చారు: జగన్
కీలకమైన బడ్జెట్ పైన మాట్లాడేందుకు ప్రధాన ప్రతిపక్షానికి చాలా తక్కువ సమయం ఇచ్చారని వైయస్ జగన్ అన్నారు. ఇది చాలా అన్యాయమని, అప్రజాస్వామికమని ఆక్షేపించారు. నిన్న తమ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారన్నారు. ముందుకు అనుకున్న ప్రకారమే సమయం ఇచ్చారన్నారు.
కాగా, సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రధాన ప్రతిపక్ష సభ్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వెల్‌లో కూర్చొని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ స్పందిస్తూ.. సభ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇష్టానుసారం నడపడానికి కాదని తీవ్రస్థఆయిలో విమర్శించింది.
రాక్షస మనస్తత్వం: గొల్లపల్లి
జగన్‌ది రాక్షస మనస్తత్వమని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు విమర్శఇంచారు. జగన్‌ది ఫాసిస్ట్ మైండ్ అని, రాక్షస మనస్తత్వం అన్నారు. జగన్ శాసన సభలో అడుగు పెట్టడం మనందరి దురదృష్టమన్నారు. ఆర్థిక ఉగ్రవాది జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు ప్రజాస్వామ్యం అంటే నిర్వహచనం తెలుసా అని ప్రశ్నించారు. ఏపీలో వైయస్ హయాంలో రాక్షస పాలన సాగించారని ఆరోపించారు.
బాధ్యతారాహిత్యం: రావెల
సభలో ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఆహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. జగన్ సుదీర్ఘ ప్రసంగంలో ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడలేదని, ప్రతిపక్ష నేత దళిత వ్యతిరేకి అన్నారు.












Click it and Unblock the Notifications