గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం; ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, మరియు సంక్షేమ మంత్రంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటికి వెళ్లిన వైసీపీ నేతలు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సమయంలో వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అనేక చోట్ల ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇక తాజాగా గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కు నిరసన సెగ తగిలింది. దీంతో ఆగ్రహించిన ముస్తఫా ప్రజలకు శాపనార్థాలు పెట్టారు. ఇంతకు ఏం జరిగిందంటే.

gunturmlamusthafa

నేడు గుంటూరులోని 9 వ డివిజన్ లో మురుగుకాల్వల శంకుస్థాపనకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా వెళ్లారు. 9 వ డివిజన్ లో సైడ్ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, శంకుస్థాపన చేయడానికి వెళ్లిన ముస్తఫాను అడ్డుకున్న మహిళలు తమ డివిజన్లో బాగున్న సైడ్ కాలవలు పగలగొట్టి, కొత్త కాల్వల నిర్మాణం చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.

కాలువలు పగులగొట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు. బాగున్న వాటికి నిధులు దుర్వినియోగం చేయకుండా వేరేచోట వాడుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా కు సూచించారు. స్థానిక కార్పొరేటర్ కూడా ఇదే విషయాన్ని వైసీపీ నేతలకు తెలిపారు. ఈ క్రమంలో తనను వ్యతిరేకించి, కార్యక్రమాన్ని అడ్డుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

డివిజన్ ప్రజలు నాశనం కావాలంటూ శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే శాపనార్ధాలపై డివిజన్ ప్రజలు మండిపడ్డారు. తాము చెప్పింది మంచి విషయమేనని, బాగున్న సైడ్ కాలవలు ఎందుకు తొలగించటం అని వారు పేర్కొన్నారు. ముస్తఫా తక్షణమే క్షమాపణ చెప్పాలని స్థానిక ప్రజలతో పాటు, పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+