వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య ఇంట్లో సోదాలు చేయాలి: రోజా, అంబానీని క్యూలో నిలబెట్టలేకపోయిన మోడీ

ప్రముఖ వ్యాపారవేత్త అదానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయాలని రోజా ఆదివారం డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రముఖ వ్యాపారవేత్త అదానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆదివారం డిమాండ్ చేశారు.

రోజా

రోజా

పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

అంబానీని క్యూలో నిలబెట్టలేకపోయిన మోడీ

అంబానీని క్యూలో నిలబెట్టలేకపోయిన మోడీ

అలాగే అమ్మను క్యూలో నిలబెట్టిన ప్రధాని మోడీ.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నిలబెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. బంగారం పైన ఆంక్షలు పెడుతున్న మోడీ, తన తల్లి వద్ద ఉన్న బంగారానికి రసీదులు ఉన్నాయో చెప్పాలని నిలదీశారు.

చిల్లర కష్టాలు

చిల్లర కష్టాలు

కాగా, నవంబర్ 8వ తేదీన రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, రూ.1000 నోట్ల రద్దును ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజలు చిల్లర కష్టాలు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ తల్లి కూడా వరుసలో నిలబడి, చిల్లర తీసుకున్నారు.

బంగారంపై ఆంక్షలు

బంగారంపై ఆంక్షలు

మూడు రోజుల క్రితం మోడీ ప్రభుత్వం బంగారం పైన ఆంక్షలు విధించింది. పెళ్లైన మహిళల వద్ద అరకిలో, పెళ్లి కాని యువతుల వద్ద పావుకిలో, పురుషుల వద్ద వంద గ్రాముల బంగారం ఉండవచ్చునని చెప్పింది. అలాగే, వారసత్వ బంగారం పైన పన్ను ఉండదని చెప్పింది. అయితే, ఆ తర్వాత ఉన్న బంగారానికి మాత్రం లెక్క చెప్పాలని ప్రకటించింది.

English summary
YSRCP MLA Roja questioned PM Narendra Modi over demonetisation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X