వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి ఎఫెక్ట్: మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాధరెడ్డితో వైసీపీ నేతల భేటీ, బాబుకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరడంతో పీలేరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.టిడిపిలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే శ్రీనాధరెడ్డి టిడిపిని వీడుతారా అనే చర్చ సాగుతోంది. వైసీపీ నేతలు శ్రీనాధరెడ్డి ఇంటికి వెళ్ళి చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. అయితే వైసీపీ మైండ్‌గేమ్ ఆడుతోందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

కిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకికిర‌ణ్‌కు షాక్: బాబుతో నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి భేటీ, టిడిపిలోకి

చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు టిడిపి వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్ రెడ్డిని టిడిపిలోకి ఆహ్వనించింది టిడిపి.. ఇటీవలనే కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరారు.

టిడిపిలోకి నల్లారి,వ్యతిరేకిస్తున్న అన్నయ్యటిడిపిలోకి నల్లారి,వ్యతిరేకిస్తున్న అన్నయ్య

కిషోర్‌కుమార్ రెడ్డితో పాటు కిరణ్‌కుమార్ రెడ్డి కూడ టిడిపిలో చేరుతారనే విషయమై ప్రచారం సాగింది. కానీ, ఆ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టిడిపిలో చేరడంతో ఇంత కాలం పాటు టిడిపిలో కొనసాగిన మాజీ ఎమ్మెల్యే శ్రీనాధ‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

 మాజీ ఎమ్మెల్యే శ్రీనాధరెడ్డగి అసంతృప్తి

మాజీ ఎమ్మెల్యే శ్రీనాధరెడ్డగి అసంతృప్తి

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో చిత్తూరు జిల్లా పీలేరు నియోజక వర్గంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.తన బద్ధ శత్రువును అధినేత చంద్రబాబు పార్టీలోకి అహ్వానించడంపై మాజీ ఎమ్మెల్యే శ్రీనాధ‌రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. మరో వైపు కిషోర్‌కుమార్ రెడ్డి పార్టీలో చేరే విషయంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తనతో సంప్రదించకపోవడంపై శ్రీనాధ‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

 శ్రీనాధరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

శ్రీనాధరెడ్డితో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత శ్రీనాధ‌రెడ్డితో వైసీపీ ఎమ్మెల్యేలు శనివారం రాత్రి సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.పుంగనూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాయచోటి వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డి శనివారం రాత్రి జీవి శ్రీనాధ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిశారు. పెద్దిరెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి శ్రీనాధరెడ్డికి మధ్య తీవ్ర విభేదాలున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉన్నాయి. అదే స్థాయిలో పెద్దిరెడ్డికి నల్లారి కుటుంబంతో విబేధాలున్నాయి.

 శ్రీనాధరెడ్డి ఇంటికి పెద్దిరెడ్డి

శ్రీనాధరెడ్డి ఇంటికి పెద్దిరెడ్డి

ఉప్పు, నిప్పులా ఉండే శ్రీనాధ‌రెడ్డి, పెద్దిరె్డ్డి రామచంద్రారెడ్డి లు ఉంటారు. అయితే పీలేరు నియోజకవర్గంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శ్రీనాధరెడ్డిని తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మేరకు శ్రీనాధరెడ్డి ఇంటికి వ్యూహత్మకంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్ళారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కిషోర్ టీడీపీలో చేరడం, జీవీ అసంతృప్తితో ఉండటంతో పెద్దిరెడ్డి జీవీని తనవైపు నడుపుకోవడానికి నిర్ణయించుకున్నారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి శనివారం పెద్దిరెడ్డి, జీవి ఇంటికి వెళ్లడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుమారు అరగంట పాటు వైకాపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీతో మంతనాలు జరిపారు.

వైసీపీది మైండ్ గేమ్

వైసీపీది మైండ్ గేమ్

వైసీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.. ప్రచారం కోసం వారు ఎంతటి చీప్‌ ట్రిక్స్‌ అయినా చేస్తారు. అటువంటిదే జీవీ శ్రీనాథరెడ్డి ఇంటికి ముగ్గురు ఎమ్మెల్యేలు రావడం. శ్రీనాథరెడ్డి టీడీపీని వీడతారంటూ జరుగుతున్న ప్రచారం పచ్చి అబద్దం. సమాచారం ఇవ్వకుండా ఆయన ఇంటికి వచ్చారని టిడిపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని చెప్పారు.

ఎవరికీ హమీ ఇవ్వలేదన్న శ్రీనాధరెడ్డి

ఎవరికీ హమీ ఇవ్వలేదన్న శ్రీనాధరెడ్డి

శ్రీనాథరెడ్డి ఇంటికి పెద్దిరెడ్డి బృందం వచ్చి వెళ్లిన వెంటనే పులివర్తి నాని పీలేరు వచ్చి ఆయనతో మంతనాలు జరిపారు. నానితో భేటీ సందర్భంగా జీవీ పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిపై పార్టీ అధినాయకత్వంతో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని, తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. తాను ఎవరికీ ఎటువంటి హా మీలు ఇవ్వలేదని, మర్యాదపూర్వకంగా ఇంటికి వచ్చిన వారిని కాదనలేక మాట్లాడి పంపించా నని తెలిపారు. చర్చల అనంతరం జీవీ విలేఖరులతో మాట్లాడుతూ నానీ మాటే తన మాట అని, టీడీపీ అధిష్ఠానం దృష్టికి తాను తీసుకెళ్లిన సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తుందన్న ఆశాభావం ఉందన్నారు.

English summary
Ysrcp MLAs met former MLA, Tdp leader GV Srinath Reddy on Saturday night at his residence.after Nallari Kishore kumar Reddy joined in TDP, Gv Srinath Reddy far away to TDP . So, Ysrcp leaders met with GV Srinath Reddy. There is speculation on GV Srinath Reddy will leave TDP Soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X