అమరావతికే నా మద్దతు...కానీ - వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!

అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేసారు. తన అభిప్రాయం స్పష్టం చేసారు.

అమరావతి అంశంపై వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత కాలంగా మైలవరంలో వైసీపీ నేతల వివాదానికి సీఎం జగన్ ముగింపు పలికారు. మంత్రి జోగి రమేష్ ..మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తోనూ సీఎం జగన్ మాట్లాడారు. ఆ తరువాత మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. పార్టీ మారుతున్నాననే వార్తలను ఖండించారు. తిరిగి నియోజకవర్గంలో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు అమరావతి అంశం పైన వసంత స్పందించారు. వ్యక్తిగతంగా అమరావతికే తన మద్దతు అని వెల్లడించారు. అయితే, ప్రభుత్వ విధానానికి తాను కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. ఇప్పుడు ఎమ్మెల్యే వసంత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యక్తిగతంగా తాను రాజధానిగా అమరావతికే మద్దతు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాల్సిందనేని వెల్లడించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆ సమయంలో స్థానిక టీడీపీ నేత అమరావతి రాజధాని పై ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. రాజధాని పై అయోమయం నెలకొనడంతో తమ భూముల ధరలు తగ్గిపోయాయన్నారు. దీనికి బాధ్యులు ఎవరని నిలదీసారు. దీనికి ఎమ్మెల్యే వసంత స్పందిస్తూ అమరావతి పైన తన అభిప్రాయం స్పష్టం చేసారు. గతంలో ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వర రావు అమరావతి పైన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే తన వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా.. ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు.

YSRCP MLA Vasanth Krishna Prasad intereting Comments on Amaravati Capital, Supports Govt decision

మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాట ఫైనల్ అని పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది. దీంతో, అప్పటి వరకు మంత్రి జోగి మద్దతు దారుల నుంచి సమస్యలు ఎదుర్కొన్న వసంత ఆ హమీతో తిరిగి యాక్టివ్ అయ్యారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తిరిగి అసెంబ్లీ గేటు తాకకుండా చేయటమే తన లక్ష్యమని స్పష్టం చేసారు. ఉమా లాంటి వారిని నమ్ముకుంటే చంద్రబాబు నష్టపోతారని పేర్కొన్నారు. తిరిగి జగన్ ను అధికారంలోకి తీసుకురావటం కోసం తాను పని చేస్తానని..రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్ కుటుంబంతోనే ఉంటానని వెల్లడించారు. ఇప్పుడు రాజధానుల వ్యవహారం రాజకీయంగా రాష్ట్రంలో ప్రధాన చర్చగా మారుతోంది. ఈ సమయంలో ఎమ్మెల్యే వసంత కామెంట్స్ అమరావతి రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+