Leader Of Oppostion: వైసీపీకి భారీ ఊరట- ఆయనకు విపక్ష నేత హోదా..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్ధితుల్లో అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల మేరకు అసెంబ్లీలో 10 శాతం సభ్యులు ఉన్న పార్టీకే విపక్ష నేత హోదా ఇస్తామని చెబుతోంది. దీంతో కేవలం 11 మంది ఎమ్మెల్యేల్ని గెల్చుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారు.
ఈ తరుణంలో వైసీపీకి శుభవార్త అందింది. అసెంబ్లీలో తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదన్న కారణంతో విపక్ష నేత ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నా.. మండలిలో మాత్రం మెజార్టీకి మించి ఎమ్మెల్సీల బలం ఉన్న ఆ పార్టీకి విపక్ష నేత హోదా దక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో విపక్ష నేతగా గుర్తిస్తూ ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పట్టుబడుతున్నారు. ఈ మేరకు స్పీకర్ అయన్నపాత్రుడికి లేఖ కూడా రాశారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం అయితే ఇవ్వడం కుదరదని చెబుతోంది. కానీ స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటివరకూ అసెంబ్లీలో సభ్యులకు స్పీకర్ సీట్ల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో సభ్యులు తమకు నచ్చిన చోట కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీ పరిస్ధితి మెరుగ్గా కనిపిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications