కాపు సామాజికవర్గ ఓట్లు దక్కేదెవరికి - ఏపీలో మారుతున్న సమీకరణాలు..!!
ఏపీలో సామాజిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాపు సామాజికవర్గ ఓట్ల కోసం పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 15 శాతం ఓటింగ్ ఉన్న కాపు సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్. 2019 ఎన్నికల్లో కాపు ఓటర్లలో మెజార్టీ శాతం వైసీపీకి అనుకూలంగా వేసారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఈ సారి పవన్ కళ్యాణ్ కేంద్రంగా కాపు సామాజిక వర్గ ఓట్ల పైన చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ స్పష్టం చేసారు. టీడీపీ -జనసేన పొత్తు ఖాయమని వైసీపీ నేతలు అంచనాకు వచ్చారు.
కాపు సామాజికవర్గం దగ్గరయ్యేలా
ఇదే సమయంలో వైసీపీ కాపు నేతలు సమావేశం అయ్యారు. పవన్ కళ్యాణ్ ప్రభావంతో కాపు సామాజిక వర్గ ఓటర్లు వైసీపీకి దూరం కాకుండా ఏ విధంగా వ్యవహరించాలనే అంశం పైన చర్చలు చేసారు. కాపు సామాజిక వర్గానికి ఈ మూడున్నారేళ్ల పాలనలో చేసిన మేలు గురించి మరింతగా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. కాపు ఓట్లతో చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ప్రయత్నిస్తున్నారంటూ రాజకీయంగా జనసేన అధినేతను ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు రాయలసీమలో ప్రజారాజ్యం పూర్వ మిత్రులు ఏకం అవుతున్నారు. పవన్ కు మద్దతుగా రంగంలోకి దిగుతున్నారు. ఇటు వైసీకి కౌంటర్ గా జనసేన కాపు నేతలు సమావేశం అవుతున్నారు. వైసీపీకి కౌంటర్ గా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

వైసీపీ వర్సస్ జనసేన
తాడేపల్లి గూడెంలో జనసేన నుంచి నియోకవర్గాల ఇంఛార్జ్ లుగా ఉన్న కాపు నేతలు సమావేవం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కాపు ఓట్లతో చంద్రబాబును సీఎం చేస్తారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ప్లాన్ సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్ కు లేఖ రాసారు. ప్రభుత్వాలు నియమించిన అనేక కమిటీలు, కమిషన్లతోపాటు మంజునాథ కమిటీ కూడా కాపు, బలిజ, ఒంటరి వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన సామాజికవర్గంగా గుర్తించిందన్నారు. కాపు, బలిజ, ఒంటరి వర్గాల ప్రజలకు ప్రత్యేకంగా 5 శాతం రిజర్వేషన్లను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అటు వైసీపీలోని మంత్రుల మొదలు నామినేటెడ్ పోస్టుల్లో కొనసాగుతన్న కాపు నేతలంతా త్వరలో విజయవాడ కేంద్రంగా సమావేశం కానున్నారు.

కాపు ఓటింగ్ పైనే పార్టీల గురి
సీఎం జగన్ తన కేబినెట్ లో కాపు మంత్రుల మొదలు నామినేటెడ్ పదవుల వరకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలోని 34 సీట్లతో కాపు వర్గ ప్రాబల్యం బలంగా ఉండటంతో, ఆ రెండు జిల్లాల కేంద్రంగా ఇప్పుడు వైసీపీ - జనసేన- టీడీపీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఇదే సమయంలో అక్కడ కీలకంగా ఉన్న బీసీ - ఎస్సీ ఓటు బ్యాంకు దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేయటం జగన్ కు కలిసి వచ్చింది. ఈ సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాజిక న్యాయం పేరుతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక, ఇప్పుడు కాపు ఓటింగ్ విషయం పార్టీలకు అంతు చిక్కటం లేదు. దీంతో, కాపు వర్గాన్ని ఓన్ చేసుకొనేందుకు కొత్త అడుగులు వేస్తున్నాయి. రానున్న రోజుల్లో పార్టీలు సామాజిక సమీకరణాల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ!












Click it and Unblock the Notifications