Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేమిరెడ్డితో రాయబారం, కీలక ప్రతిపాదన- ఏం జరుగుతోంది..!!

ఎన్నికల వేళ ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో ఆసక్తి కర రాజకీయం మొదలైంది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు..రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. నెల్లూరు ఎంపీగా పార్టీ వేమిరెడ్డిని ఖరారు చేసింది. వరుసగా చోటు చేసుకున్న మార్పులతో వేమిరెడ్డి అసహనానికి గురయ్యారు. పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమయంలోనూ కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.

టీడీపీలోకి వేమిరెడ్డి : రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పైన ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్దిగా వైసీపీ వేమిరెడ్డిని బరిలోకి దించేందుకు నిర్ణయించింది. ఈ సమయం లోనే వేమిరెడ్డి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో మూడు సీట్లలో మార్పులు సూచించారు.

YSRCP MP Vemireddy Prabhakar Reddy to join in TDP, Contest for Nellore Loksabha

తన సూచన పట్టించుకోవటం లేదనే కారణంగా టీడీపీలో చేరాలని నిర్ణయించారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తరువాత వైసీపీ ముఖ్య నేతలు టచ్ లోకి వెళ్లారు. పార్టీ వీడకుండా వారించే ప్రయత్నం చేసారు. కానీ, వేమిరెడ్డి తన వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసారు. ఈ సమయంలో కొద్ది రోజులుగా చెన్నై కేంద్రంగా రాజకీయ మంత్రాంగం నడిపిన వేమిరెడ్డి ఈ రోజు నెల్లూరు లో కీలక భేటీ ఏర్పాటు చేసారు.

కీలక మంత్రాంగం : నెల్లూరు జిల్లాలో తన అనుచర వర్గం, సన్నిహితులతో భేటీ ఏర్పాటు చేసారు. వైసీపీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించనున్నారు. వైసీపీ నుంచి తాజాగా ముఖ్య నేతలు మాట్లాడిన సమయంలో అభ్యర్దుల విషయంలో జగన్ తో మరోసారి చర్చించాలని సూచించారు. సీఎం జగన్ తో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అయితే, వేమిరెడ్డి అందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పార్టీ మార్పు పైన సన్నిహితుల నుంచి పునరాలోచన చేయాలనే సూచన వచ్చింది. దీంతో..ఈ రోజు జరిగే కీలక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కానీ, వేమిరెడ్డి దాదాపుగా టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. వేమిరెడ్డి పార్టీకి, ఆయన సతీమణి ప్రశాంతి టీటీడీ బోర్డుకు రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది.

YSRCP MP Vemireddy Prabhakar Reddy to join in TDP, Contest for Nellore Loksabha

ఎంపీగా బరిలో : రాజీనామా సమర్పించిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో చర్చించి టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆయన టీడీపీ నుంచి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో నిలుస్తారని తెలుస్తోంది.

అందులో భాగంగా వేమిరెడ్డి సూచించిన విధంగా సీట్ల మార్పుకు టీడీపీ సిద్దమైందని చెబుతున్నారు. దీంతో, ఈ రోజు వేమిరెడ్డి తన రాజకీయ ప్రయాణం..ఎన్నికల్లో పోటీ పైన స్పష్టమైన ప్రకటన చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+