తెలంగాణా, ఏపీ మీదుగా 16వేలకే కాశీ, అయోధ్య, బైద్యనాథ్ క్షేత్రాలకు ప్రత్యేక రైలు.. త్వరపడండి!
ఏపీ, తెలంగాణా వాసులకు సూపర్ న్యూస్.. ఉత్తర భారతదేశ పుణ్య క్షేత్రాలను దర్శించాలి అనుకునే వారికి ఐఆర్ సీటీసీ ఒక శుభవార్త చెప్పింది. దేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను తక్కువ ఖర్చులో సందర్శించాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ మంచి అవకాశం కల్పించింది. అయోధ్య - కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ అనే పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనుంది.
9 రాత్రులు, 10 పగళ్ల యాత్ర అయోధ్య - కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్
జులై 4, 2026న సికింద్రాబాద్ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. 9 రాత్రులు, 10 పగళ్ల యాత్రలో కాశీ (వారణాసి), అయోధ్య, ప్రయాగ్‌రాజ్, బైద్యనాథ్ ధామ్ వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించవచ్చు. ఈ యాత్రలో భాగం తీసుకోవాలనుకునే వారు సికింద్రాబాద్‌తో పాటు చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో రైలు ఎక్కవచ్చు.

యాత్ర షెడ్యూల్ ఇలా
మొదటి రెండు రోజులు: సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తెలుగురాష్ట్రాల స్టేషన్లగుండా ప్రయాణం.
మూడవ రోజు: గయ చేరుకుని విష్ణుపాద దేవాలయం సందర్శన.
నాలుగు, ఐదు రోజులు: వారణాసి (కాశీ విశ్వనాథ్, విశాలాక్షి, అన్నపూర్ణ, సారనాథ్) మరియు గంగా హారతి.
ఆరవ రోజు: అయోధ్యలో రామమందిరం, హనుమాన్ గఢి.
ఏడవ రోజు: ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం.
ఎనిమిదవ రోజు: బైద్యనాథ్ ధామ్ దర్శనం.
తొమ్మిది, పది రోజులు: తిరిగి సికింద్రాబాద్ చేరుకోవడం.
ప్యాకేజీ ధరలు:
స్లీపర్ క్లాస్ కు పెద్దలకు రూ.16,400, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.15,300 గా ఉంది
3 ఏసీకి పెద్దలకు రూ.25,500, పిల్లలకు రూ.24,200 చార్జీలు ఉన్నాయి.
2 ఏసీకి పెద్దలకు రూ.33,200, పిల్లలకు రూ.31,500గా ఉన్నాయి.
భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహించేలా యాత్ర
ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, భోజనాలు, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఇది తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలను సందర్శించే అపూర్వ అవకాశం. మరిన్ని వివరాలు మరియు బుకింగ్ కోసం IRCTC వెబ్‌సైట్ లేదా సంప్రదించవచ్చు. ఈ టూర్ ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ప్రయాణం చేసి, మంచి అనుభవం పొందవచ్చు. ఐఆర్‌సీటీసీ ఇలాంటి ప్యాకేజీలతో భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తోంది.













Click it and Unblock the Notifications